Friday, July 4, 2025

అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో యూరియా కొరత:ఎంపి డికె అరుణ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో యూరియా కొరతపై రైతుల్లో అపోహలు కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం, బిఆర్‌ఎస్ నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని మహబూబ్‌నగర్ ఎంపి డికె అరుణ అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ పాలన వల్లే ఏర్పడిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఎక్కడా ఎరువుల కొరత లేకపోయినా, ఒక్క తెలంగాణలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దారుణమన్నారు. సరఫరా, నిల్వల ప్రణాళికలో వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు సరఫరా, నిల్వల ప్రణాళికపై వైఫల్యం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నార న్నారు. ఎరువుల విషయంలో రాష్ట్ర రైతులు ఎలాంటి అపోహలో పడొద్దని, ఈ రబీ సీజన్‌కు రాష్ట్రానికి అవసరమైన యూరియాను కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసిందన్నారు.

రాష్ట్రానికి అవసరం 9.5 లక్షల మెట్రిక్ టన్నులైతే కేంద్రం 12.02 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా పంపిందని గుర్తు చేశారు. ఇదే కాకుండా డీఏపీ, ఎన్‌పికెఎస్ వంటి అన్ని ఎరువులూ రాష్ట్ర అవసరానికి మించి పంపించా మన్నారు. డీఏపీ కోసం 1.47 లక్షల టన్నులు అవసరం ఉండగా, 1.72 లక్షల టన్నులు పంపించడమే దీనికి ఉదాహరణ అని అన్నారు. కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్ర అవసరాలను అంచనా వేసి అధికంగా సరఫరా చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మార్క్‌ఫెడ్ దివాళా తీసిందని చెబుతూ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలను రైతులపై మోపడం, కొన్ని కోఆపరేటివ్ సంఘాల్లో ఎరువులు నిల్వ వేసి బ్లాక్ మార్కెట్‌కు తిప్పడంపై ఆరోపణలు రావడం ఈ పరిస్థితికి నిదర్శనం. అసలు సమస్య రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. కానీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడం అనైతిక చర్యగా ఆమె అభివర్ణించారు.

రైతుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క యూరియా బస్తాకు రూ.2,236, డీఏపీ బస్తాకు రూ.2,422 సబ్సిడీ ఇస్తోంది. ఒక్క ఎకరా రైతుకు ఒక పంటకు రూ.9,31 6 విలువైన ఎరువుల సబ్సిడీ లభిస్తోందన్నారు. ఏడాదికి రెండు పంటలు పండిస్తే రూ.18,632. దీనికి తోడు పీఎం కిసాన్ ద్వారా రూ.6,000 కలిపి మొత్తంగా రూ.24,632 మద్దతు కేంద్రం అందిస్తోందని వెల్లడించారు. ఇంతటి మద్దతు అందిస్తున్న కేంద్రంపై తప్పుగా ఆరోపణలు చేయ డం, రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఎరువుల కొరత అనేదే లేదు. రాష్ట్ర ప్రభుత్వం సప్లై చైన్‌లో వైఫ ల్యం, అవినీతి, చొరవలేని పాలన కారణంగా రైతులకి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.268కే ఇవ్వాల్సిన యూరి యాను అధిక ధరకు, రూ.1311కే ఇవ్వాల్సిన డీఏపీను అదనంగా ధర వసూలు చేస్తూ విక్రయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దోచుకుం టోందన్నారు.

స్థానిక ఎన్నికలు జరపలేకపోయిన కారణంగా ఆర్థిక సంఘం నిధులు కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చిన ఎరువులను కూడా సమర్థంగా పంపిణీ చేయలేక రైతులను ఇబ్బందుల్లో పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా గత 10 ఏళ్లలో రూ.12.5 లక్షల కోట్ల ఫెర్టిలైజర్ సబ్సిడీ ఖర్చు చేసిందన్నారు. ప్రత్యేకంగా తెలంగాణలో మూతబడ్డ రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్‌ను రూ.6,338 కోట్లతో పునరుద్ధరించి మళ్లీ ప్రారంభించిందన్నారు. ఇవన్నీ మోడీ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎంపి డికె అరుణ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News