Monday, April 29, 2024

ఆలయాల బిల్లుపై బిజెపి దుష్ప్రచారం: సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో అధికార కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ.10 లక్షలకు పైబడి వార్షికాదాయం ఉన్న ఆలయాల నుంచి నిధులను వసూలు చేయాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కర్నాటక శాసనమండలిలో ప్రతిపక్ష బిజెపి-జెడిఎస్ కూటమి ఓడించించడం పై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు. శాసన మండలిలో బిల్లు వీగిపోవడంపై ప్రతిపక్షాలను ముఖ్యంగా బిజెపిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిందించారు. ఆలయాల నుంచి నిధులను వసూలు చేయడానికి ఉద్దేశించిన బిల్లుపై బిజెపి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు.

కర్నాటక హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్(సవరణ) చట్టం, 2024ను గత వారం రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. అయితే శాసన మండలిలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్నందున ఈ బిల్లు పెద్దల సభలో మూజువాణి ఓటుతో వీగిపోయింది.ఆ బిల్లులో అభ్యంతరం పెట్టాల్సిన అంశాలేవీ లేవని సిద్దరామయ్య అన్నారు. కావాలనే బిల్లును ఓడించారని ఆయన విమర్శించారు. సంపన్న హిందూ ఆలయాల నుంచి కొంత ధనాన్ని తీసుకుని తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఇవ్వడమే ఈ బిల్లు ఉద్దేశమని ఆయన చెప్పారు. ఈ నిధులను మరే ఇతర అవసరాలకు ఉపయోగించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

హిందువుల డబ్బును లూటీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందన్న బిజెపి నాయకుల ఆరోపణను విలేకరులు ప్రస్తావించగా లూటీ చేసినందుకే వారిని రాష్ట్ర ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని ఆయన విమర్శించారు. కాగా.. రూ. 10 లక్షలకు పైబడి రూ 1 కోటి లోపల వార్షికాదాయం ఉన్న ఆలయాల నుంచి 5 శాతం, రూ.1 కోటికి పైబడి వార్షికాదాయం ఉన్న ఆలయాల నుంచి 10 శాతం చొప్పున నిధులు వసూలు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ నిధులను రాజ్య ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నడిచే కామన్ పూల్ ఫండ్‌లో జమచేసి ఆ నిధులను అర్చకుల సంక్షేమానికి, సి క్యాటగిరి ఉద్యోగుల జీతభత్యాలకు ఉపయోఇంచాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News