Friday, April 26, 2024

గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించిన బిఒబి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నూతన ఇల్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంకు ఆఫ్ బరోడా ప్రకటించింది. గృహ రుణాల వడ్డీ రేటును ప్రభుత్వ రంగానికి చెందిన బిఒబి బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో గృహ రుణాల వడ్డీ రేట్లు బిఒబిలో ప్రస్తుతం 8.25 శాతానికి దిగొచ్చాయి. అలాగే పరిమిత కాల వ్యవధిలో ప్రాసెసింగ్ ఫీజును కూడా ఈ బ్యాంకు ఎత్తివేసింది. దిగ్గజ బ్యాంకులైన ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సిలతో పోలిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలోనే వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి.

ఈ బ్యాంకులు కూడా పండగ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. 8.40 శాతం నుంచి గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్‌బిఐ గృహ రుణాల వడ్డీ రేట్ల ఆఫర్ జనవరి 2023 వరకు అందుబాటులో ఉండగా హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ నవంబర్ చివరి వరకు వర్తిస్తుంది. ఆ రేట్లతో పోలిస్తే బిఒబి రేటు ఇంకా తక్కువగా ఉంది.

బ్యాంకు ఆఫ్ బరోడా ప్రస్తుతం ప్రకటించిన ఈ కొత్త రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆ డిసెంబర్ చివరి వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయని బిఒబి తెలిపింది. అలాగే ఎలాంటి ప్రీపేమెంట్ ఛార్జీలను కానీ లేదా పార్ట్‌పేమెంట్ ఛార్జీలను కానీ కస్టమర్లపై విధించమని బ్యాంకు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News