Sunday, March 26, 2023

రైతుకు పాముకాటు.. కాపాడిన 108 అంబులెన్స్

- Advertisement -

 

ఆదిలాబాద్: జిల్లాలోని భీంపూర్ మండలం పిప్పల్‌కోటీ గ్రామానికి చెందిన రైతు స్వామి ఇటీవలే నిపాని గ్రామానికి వచ్చి తన అక్కయ్య ఇంట్లో ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం చేనులో పనులు చేస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. పక్కనున్నవారు వెంటనే సర్పంచ్ రాజన్న, రైతుబంధు అధ్యక్షుడు అనిల్ కు సమాచారం ఇచ్చారు. వారు 108 కు ఫోన్ చేయగా 10 నిమిషాలలో భీంపూర్ పీహెచ్‌సి నుంచి వచ్చిన అంబులెన్స్ బాధితుడిని రిమ్స్‌కు తరలించారు. అంబులెన్స్‌లో ఈఎంటీ గజానన్, పైలట్ అర్ఫజ్‌లు వేగంగా రిమ్స్ కు చేర్చటం, 108లో కూడా అత్యవసర చికిత్స అందజేయడంతో ప్రాణాప్రాయం తప్పినట్లు గ్రామస్తులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News