Friday, June 9, 2023

తల్లిదండ్రులు కొడుతున్నారని పోలీసులకు బాలుడి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

శంకర్‌పల్లి: తనను తల్లిదండ్రులు కొడుతున్నారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన శంకర్‌పల్లిలో మంగళవారం జరిగింది. శంకర్‌పల్లి ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్‌కు చెందిన మల నర్సింలు, మల లక్శ్మిలు శంకర్‌పల్లి హనుమాన్ నగర్‌లో వలస వచ్చి నివాసం ఉంటున్నారు.

11 ఏళ్ల వారి కుమారుడు మల రాములు మంగళవారం శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తల్లిదండ్రులు తనను రోజు కొడుతున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి బాలుడి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ బాలుడి కొడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News