Saturday, February 4, 2023

పదవులన్ని మంత్రి మల్లారెడ్డి అనుయాయులకే… ఆ ఎమ్మెల్యేలు సీరియస్..

- Advertisement -

మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి తన అనుయాయులకే పదవులను కట్టబెడుతుండడంతో జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సిఎం కెసిఆర్ , కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద, మాధవరం కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. మా నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. మార్కెట్ కమిటి చైర్మన్ పదవి విషయంలో మంత్రి మల్లారెడ్డి అందరిని కలుపుకుని పోలేదని వివేకానంద ఆవేదన వ్యక్తం చేశారు.

మేడ్చల్ నియోజకవర్గం నేతలకే పదవులన్ని కట్టబెట్టడంతో మిగిలిన టిఆర్‌ఎస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరొన్నారు. ఒక్క నియోజకవర్గానికే పదవులన్ని పోతున్నాయని, జిల్లా పదవులన్ని మంత్రి మల్లారెడ్డి ఒక్కరే తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలకు మంత్రి మల్లారెడ్డి గౌరవం ఇవ్వడం లేదని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అందరితో మాట్లాడాలని సిఎం చెప్పిన మంత్రి మల్లారెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. కార్యకర్తల ఆవేదన తెలిపేందుకే  టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, కెపి వివేక్, మాధవరం కృష్ణారావు, మైనంపల్లి హనుమంతరావు, వివేకానంద సమావేశమయ్యామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles