Monday, April 29, 2024

బిఆర్ఎస్ కు ఎంపి బిబి పాటిల్ గుడ్ బై

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జహీరాబాద్:  పార్లమెంట్ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బిఆర్ఎస్ ఎంపిలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేస్తూ బిజెపిలో చేరుతున్నారు. తాజాగా శుక్రవారం జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్ బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈరోజుల ఢిల్లీలో బిజెపి అగ్రనేత తరుణ్ చుగ్ సమక్షంలో పాటిల్ కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్.. ఆయనకు పార్టీ కండువా కప్పి బిజెపిలోకి ఆహ్వానించారు.

అనంతరం తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. తెలంగాణను బిఆర్ఎస్ చర నుంచి విడిపించామన్నారు. ఇక బిఆర్ఎస్ లో ఎవరూ మిగలరని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే బిఆర్ఎస్ పని అయిపోయిందని… ఇప్పుడు బిజెపి, కాంగ్రెస్ మద్యే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో ఈసారి మెజార్టీ స్థానాలను బిజెపి గెలుస్తుందని.. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తరుణ్ చుగ్ అన్నారు. కాగా, నిన్న నాగర్ కర్నూల్ ఎంపి రాములు తన కొడుకుతో కలిసి బిజెపిలో జాయిన్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News