Sunday, May 19, 2024

ఎంబిబిఎస్‌ విద్యార్థి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Brutal murder

 

జయశంకర్‌ భూపాలపల్లి : ఎంబిబిఎస్‌ చదువుతున్న విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుమ్మలపల్లి వంశి(20) అనే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి బావిలో పడేశారు. కాళ్లు, చేతులు కట్టేసి కర్రలతో కొట్టడంతోనే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి స్వస్థలం తుమ్మలపల్లి గ్రామంగా గుర్తించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వంశి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వంశి ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు.

 

Brutal murder of MBBS Student
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News