Thursday, May 1, 2025

కాంగ్రెస్‌లో విస్తరణం

- Advertisement -
- Advertisement -

అధికార పార్టీలో పెరుగుతున్న అసమ్మతి
స్వరాలు వాయిదా పడుతున్న మంత్రివర్గ
విస్తరణ ఆశావహుల మధ్య పేలుతున్న
తూటాలు కీలకంగా మారిన సామాజిక
సమతూకం తమ సామాజిక వర్గానికి
అవకాశం కల్పించాలని కోరుతూ అధిష్ఠానానికి
ఇప్పటికే ఆయా వర్గాల లేఖలు ప్రాంతాలవారీగా
పెరుగుతున్న విజ్ఞప్తులు సంక్లిష్టంగా మారిన
కేబినెట్ విస్తరణ ఆచితూచి వ్యవహరిస్తున్న
కాంగ్రెస్ అధిష్ఠానం

మన తెలంగాణ/హైదరాబాద్: అధికార కాం గ్రెస్‌లో అసమ్మతి రాజుకుంటోంది. మంత్రివ ర్గ విస్తరణ అంశం ఆ పార్టీ నేతల్లో అసహనానికి దారితీస్తున్నది. మంత్రి విస్తరణ ఆలస్యం అవుతుండటంతో ఆశావహుల మధ్య మాట ల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లో అసమ్మతి స్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర రాజకీయాలలో హాల్ టాపిక్‌గా మారింది. కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడం పట్ల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు,మల్‌రెడ్డి రం గారెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇప్పటికే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరికొందరు అదేబాట పట్టారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో తనకు మంత్రిపదవి రాకుం డా సీనియర్ నేత జానారెడ్డి అడ్డుకున్నారం టూ మునుగోడు ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర దుమారాన్ని లేపాయి. అదే విధంగా చెన్నూరు ఎంఎల్‌ఎ వివేక్ వెంకటస్వామి కుటుంబంపై మంచిర్యాల ఎంఎల్‌ఎ ప్రేమ్‌సాగర్‌రావు చేసిన వ్యాఖ్యలు, తనకు మంత్రి పదవి దక్కకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

హెలికాప్టర్ లేకుండా నల్లగొండ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బయట అడుగు పెట్టడం లేదని మరో మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించడం, తనకు మంత్రిపదవి దక్కకపోతే తాను కాం గ్రెస్ రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఎ మల్‌రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసింది. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొట్టిపారేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాను దశాబ్దకాలం ఒంటరిగా పోరాటం చేశానని, కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేశానని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వి.హనుమంతరావు తర్వాత తానే సీనియర్ నాయకుడినని, జానారెడ్డి కూడా తన కంటే నాలుగేళ్ల తర్వాత పార్టీలోకి వచ్చారని వెల్లడించారు. అయితే పార్టీలో సీనియారిటీకి స్థానం ఏమిటనే బాధ తనలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు సీనియర్లు వారి అభిప్రాయాలను మాట్లాడి ఉండవచ్చని అన్నారు.

కొనసాగుతున్న వాయిదాల పర్వం
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. గత 16 నెలలుగా మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠకు.. హైకమాండ్ తెరదించబోతోందనుకుంటే, ఆశావహులకు మరోసారి నిరాశే ఎదురవుతోంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. విస్తరణ ప్రక్రియను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిదని ఎఐసిసి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిమండలిలో మరో ఆరుగురికి అవకాశం ఉండగా, ఆశావహుల సంఖ్య మాత్రం అందుకు రెండింతలు ఉన్నట్లు సమాచారం. జిల్లాలు, సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుని ఆరు మంత్రి పదవులు కేటాయించడం కాంగ్రెస్ అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. అందుకే ఈ వ్యవహారంలో మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

కేబినెట్‌లో సామాజిక సమతుల్యత కీలకంగా మారినట్లు తెలుస్తోంది. బిసి,ఎస్‌సి, ఎస్‌టి సామాజిక వర్గాలకు చెందిన ఎంఎల్‌ఎలు తమ సామాజికవర్గానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాశారు. దాంతో మంత్రివర్గ విస్తరణను మరింత సంక్లిష్టంగా మారినట్లు సమాచారం. వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌ల పేర్లు బిసి సామాజిక వర్గం నుంచి పరిశీలనలో, ఎస్‌సి మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, లంబాడా సామాజికవర్గం నుంచి బాలు నాయక్ మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఇలా ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖలు రాయడంతో పాటు ప్రాంతాలవారీగా విడిపోయి, తమకు అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ వెళ్లి మరీ విజ్ఞాపనలు అందజేశారు. కాగా, ఆరు మంత్రి పదవుల్లో ఒకటి మైనారిటీలకు కేటాయించాలని అధిష్టానం భావించినట్లు సమాచారం. మిగిలిన ఐదు మంత్రి పదవులకు మూడింతల ఆశావహులు ఉండటంతో మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా వేసినట్టు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News