Monday, April 29, 2024

రవాణశాఖ పరిధిలోకి క్యాబ్‌లు

- Advertisement -
- Advertisement -

Cabs

 

హైదరాబాద్ : ఇంత వరకు హద్దు అదుపు లేకుండా నడుస్తున్న క్యాబ్‌లకు రవాణాశాఖ కళ్ళెం వేయనుంది. ఉబర్, ఓలా వంటి క్యాబ్ సేవలను రవాణాశాఖ పరిధిలోకి తీసుకు రానున్నారు. వీటిని నడపాలంటే రవాణాశాఖ నుంచి ఆపరేటర్లు లైసెన్స్‌లు పొందాల్సి ఉంటుంది. కొత్తగా తెస్తున్న రవాణాశాఖ చట్ట సవరణల్లో ఈ విషయాన్ని చేర్చారు. ఐతే కొత్తగా తెస్తున్న నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందాలంటే రవాణాశాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సేవల విషయంలో కూడా హామీ ఇవ్వాల్సి ఉంది. త్వరలో తీసుకురానున్న రవాణాశాఖ చట్టసవరణల్లో ఈ అంశాన్ని చేర్చనున్నట్లు తెలిసింది. క్యాబ్ ఓనర్లు మాత్రమే ట్యాక్స్ ప్లేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుండే వారు.

అయితే క్యాబ్‌లకు సమన్వయ కర్తలుగా మాత్రమే ఉంటూ అనేక కంపనీలు క్యాబ్‌లను నడుపుతున్నాయి. వీటి మీద రవాణాశాఖకు ఎటువంటి నియంత్రణ అధికారం లేదు. కొత్తగా తెస్తున్న నిబంధలన ప్రకారం లైసెన్స్ పొందాలంటే రవాణశాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సేవల విషయంలో కూడా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారమే క్యాబ్ సర్వీసులను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే విధానం వల్ల వినియోగదారులైన ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. నగరంలో సుమారు 60 వేల క్యాబ్‌లు తిరుగుతుండగా వీటన్నింటిని ఎన్‌ఫోర్స్ చేయడానికి రవాణాశాఖకు అధికారం ఉంటుంది.

ప్రయాణికుల హక్కులు లేదా సౌకర్యాలకు ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే రవాణాశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా వాటి మీద అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆపరేటర్ల మద్య పోటీ పెరిగి ప్రయాణ చార్జీలు తగ్గే అవకాశం ఉందని రవాణాశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఆటో ప్రయాణికుల చార్జీల మాదిరిగా నియంత్రణ కూడా ఉండే అవకాశం ఉందని తెలిపారు. అంతే కాకుండా ఇష్టారీతిని చార్జీలు వసూలు చేసే పద్దతి కూడా కొత్త విధానం వల్ల పుల్‌స్టాప్ పడుతుందని తద్వారా ప్రయాణికులకు మేలు కలుగుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

 

Cabs under Department of Transportation
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News