Tuesday, May 14, 2024

కొట్టేసిన కార్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : కొట్టేసిన కార్లను విక్రయిస్తున్న ముఠాను నార్త్‌జోన్‌టాస్క్ ఫోర్స్, చిలకలగూడ పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.45కోట్ల విలువైన 18 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌జోన్ డిసిపి సునీల్‌దత్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దమ్మాయిగూడకు చెందిన ఠాకూర్ శైలేందర్‌సింగ్, అబ్దుల్ రహీం ఖాన్, షేక్ జావీద్, వరికుప్పల దశరథ్, శానవాజ్ అలీ ఖాన్, బప్పా గోష్, కోడిమల్ల పరిపూర్ణ చారీ అలియాస్ పప్పి, కలీం కలిసి కార్లను కొట్టేసి విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితుడు కోల్‌కతాకు చెందిన బప్పా గోష్ ఖరీదైన కార్లను ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల నుంచి చోరీ చేస్తున్నాడు.

కార్ల ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చి నకిలీ నంబర్ ప్లేట్, ఆర్‌సిని మహారాష్ట్ర, వెస్ట్‌బెంగాల్‌కు సంబంధించినవి తయారు చేస్తున్నారు. తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన కారు డీలర్లను సంప్రదించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే కారు డీలర్‌గా పనిచేస్తున్న రహీంఖాన్ గోష్‌ను సంప్రదించాడు. అతడి వద్ద రహీంఖాన్ 2, శానవాజ్ అలీ ఖాన్ ఒకకారు కొనుగోలు చేశాడు. రహీంఖాన్ ద్వారా కోల్‌కతాలో తక్కువ ధరకు కార్లు వస్తాయని షేక్ జావీద్ తెలుసుకున్నాడు. అతడి ద్వారా కార్లు కొనుగోలు చేశాడు. కోడిమాళ్ల పరిపూర్ణ చారీ,గోష్ వద్ద కార్లు కొనుగోలు చేయడంతో మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి వల్లే శైలేందర్ సింగ్, కోల్‌కతాకు చెందిన గోష్ వద్ద కార్లు కొనుగోలు చేశాడు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌ఛార్జ్ డిసిపి శభరీష్, ఇన్స్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సైలు అశోక్ రెడ్డి, శ్రీకాంత్, అనంతచారి, అరవింద్ గౌడ్, తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News