Monday, April 29, 2024

మ్యాట్రీమోని వేదికగా మోసాలు..నైజీరియన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వివాహం చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నైజీరియన్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నైజీరియాలోని లాగోస్‌కు చెందిన అలెక్స్ మార్క్ ఓడుడు దుస్తుల వ్యాపారం చేసేందుకు 20 ఏళ్ల క్రితం ముంబాయికి వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఇక్కడ ఉన్న మిగతా నైజీరియన్లతో కలిసి సైబర్ నేరాలు చేస్తున్నాడు. ఆయుర్వేదిక్ ఆయిల్ పేరుతో మోసం చేయడంతో మహారాష్ట్ర పోలీసులు 2022లో అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మిగతా నైజీరియన్లతో కలిసి ఆన్‌లైన్‌లో మోసం చేస్తున్నాడు.

మ్యాట్రిమోని సైట్ నుంచి హైదరాబాద్‌కు చెందిన బాధితురాలి వివరాలు తెలుసుకున్న నిందితుడు తాను అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. తాను సిరియాలో డ్యూటీ మీద వెళ్తున్నానని, తర్వాత వస్తానని చెప్పాడు, తర్వాత నిందితుడు ఫోన్ చేసి తాను ఇక్కడ ఇరుక్కుపోయానని చెప్పాడు. ఇండియాకు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత తనను ఎయిర్ పోర్టు అధికారులు పట్టుకున్నారని వెంటనే డబ్బులు పంపించాలని చెప్పడంతో బాధితురాలు నమ్మి రూ.27.43లక్షలు పంపించింది. తర్వాత నుంచి నిందితుడు స్పందించడం మానివేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు సైదులు, రామకృష్ణ, ఎస్సైలు అశోక్‌రెడ్డి, గంగాధర్, నవీన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News