Tuesday, April 16, 2024

రైళ్ల ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించాము: రైల్వే మంత్రి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన బాలాసోర్ జిల్లాలో దారుణ రైలు ప్రమాదం ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ మార్చడం వల్ల జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు. వైష్ణవ్ ప్రమాదస్థలిలో ఉండి, ట్రాక్ పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నారు. ‘రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ పూర్తి చేశారు. నివేదికను త్వరలో అందించనున్నారు. ముందు పరిశోధన రిపోర్టు రాన్విండి. రైళ్ల ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించాము. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ మార్చడం వల్ల ఈ ప్రమాదం జరిగింది’ అని వైష్ణవ్ తెలిపారు.

‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను ఎవరు మార్చారన్నది పరిశోధన సమయంలో తెలియగలదు’ అన్నారు. అయితే ఈ ప్రమాదానికి కవచ్‌ను ఏర్పాటు చేయకపోవడం లేక యాంటీ కొలిషన్ డివైస్(ఢీ నిరోధించే పరికరం)తో పనిలేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలపైన పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం కల్లా పునరుద్ధరణ పనులు పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి తెలిపారు.

చెన్నైకు వెళుతున్న కొరమండల్ ఎక్స్‌ప్రెస్, హౌరాకు వెళుతున్న ఎస్‌ఎంవిపి హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన బాహనాగా బజార్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం ఈ ప్రమాదం సంభవించింది. కనీసం 288 మంది చనిపోగా, 1100 మందికి గాయాలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News