Thursday, September 18, 2025

వామన రావు హత్య కేసులో.. మంథని కోర్టుకు సిబిఐ బృందం

- Advertisement -
- Advertisement -

మంథని : రాష్ట్రంలో తీవ్ర‌ సంచలనం సృష్టించిన అడ్వ‌కేట్‌ వామన్ రావు దంపతుల హత్య కేసులో (Vamana Rao Case) సిబిఐ విచారణ ప్రారంభమైంది. వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మంథని కోర్టులో ప్రభుత్వ సమాచారాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా వామన్ రావు స్వగ్రామమైన గుంజపడుగు వెళ్లి వివరాలను సేకరించారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఏడుగురు నిందితులు బెయిల్‌పై ఉన్నారు.

వామన్‌రావు దంపతుల హత్య కేసులో (Vamana Rao Case) మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని తండ్రి కిషన్‌రావు ఆరోపణల నేపథ్యంలో సిబిఐ అధికారులు విచారణ ప్రారంభించారు. అనంతరం మంథని కోర్టు ప్రాంగణంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు, తమ్ముడు చంద్రశేఖర్ నుంచి వివరాలను సిబిఐ అధికారులు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు.

Also Read : లాయర్ దంపతుల హత్యకేసు.. సిబిఐకి అప్పగించిన సుప్రీం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News