Monday, May 6, 2024

జామియా విద్యార్థులపై పోలీసుల దాడి దృశ్యాలు (వీడియో)

- Advertisement -
- Advertisement -

police

న్యూఢిల్లీ: పోలీసులే తమపై దాడి చేశారంటూ ఢిల్లీ జామియా యూనివర్శిటీ విద్యార్ధులు ఓ వీడియోను విడుదల చేశారు. రెండు నెలల క్రితం సిఎఎకి వ్యతిరేకంగా జామియా, మిలియా యూనివర్శిటీ విద్యార్ధులు ఆందోళనలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి యూనివర్శిటీ లైబ్రరీ రీడింగ్ హాల్ లో ఉన్న విద్యార్ధులపై దాడులు చేస్తున్నట్టుగా ఆ వీడియాలో ఉంది. 49 సెకన్లు ఉన్న ఆ క్లిప్ లో రీడింగ్ హాల్ లో విద్యార్ధులు కుర్చున్నారు. డెస్క్ వద్ద కుర్చున్న ఓ విద్యార్థి పోలీసులు రావడాన్ని గమనించి టేబుల్ కింద దాక్కున్నాడు. మరో విద్యార్థి ఆరూమ్ అంతా పరిగెత్తడం కనిపిస్తోంది. విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా లాఠీచార్జీ చేయడం అందులో కన్పిస్తోంది. డిసెంబర్ 15న జామియా, మిలియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ ఘటనలో సూమారు వంద మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోను విద్యార్ధులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది.

 

https://twitter.com/Jamia_JCC/status/1228772837583753216

CCTV Footage of Police Brutality in Old Reading Hall

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News