Saturday, April 20, 2024

దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

Centre says Two Omicron cases in India

దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు : కేంద్రం
కర్ణాటక వచ్చిన ఇద్దరిలో బయటపడిన ఒమిక్రాన్
జీనోసిమ్ సీక్వెన్సింగ్ కోసం 37 ప్రయోగశాలలు

న్యూఢిల్లీ : మనదేశంలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. విదేశాల నుంచి కర్ణాటక వచ్చిన ఇద్దరు పురుషుల్లో ఈ వేరియంట్ బయటపడినట్టు వెల్లడించింది. వీరిలో ఒకరి వయసు 66 ఏళ్లు కాగా, మరొకరి వయసు 46 ఏళ్లు. అయితే గోప్యతను దృష్టిలో ఉంచుకుని వారి పేర్లను వెల్లడించడం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కర్ణాటక వచ్చి వీరిద్దరికీ తొలుత కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ కోసం పంపించగా వారిలో ఒమిక్రాన్ ఉన్నట్టు ఇండియన్ సార్స్ కొవ్ 2 కన్సార్టియం (ఇన్సాకాగ్) నిర్ధారించింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించామని, వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియచేసింది.

ఒమిక్రాన్ వెలుగు చూసిన ఇద్దరి లోనూ తీవ్రమైన లక్షణాలేవీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర జాగ్రత్తలతోపాటు తప్పనిసరిగా రెండు డోసుల టీకా తీసుకోవాలని సూచించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 37 ప్రయోగశాలలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేసినట్టు చెప్పారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఒకవేళ నెగిటివ్ వచ్చినా సరే వారం రోజుల పాటు క్యారంటైన్ లోనే ఉంచనున్నట్టు తెలిపారు

29 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి …

ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 29 దేశాలకు విస్తరించిందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 373 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడగా, బోట్స్‌వానాలో 19, నెదర్లాండ్స్‌లో 16, హాంగ్‌కాంగ్‌లో 7, ఇజ్రాయిల్‌లో 2, బెల్జియం లో 2, బ్రిటన్‌లో 32, జర్మనీలో 10, ఆస్ట్రేలియాలో 8, ఇటలీలో 4, డెన్మార్క్‌లో 6,ఆస్ట్రియాలో 4, కెనడాలో 7, స్వీడన్‌లో 4, స్విట్జర్లాండ్‌లో 3, స్పెయిన్‌లో 2, పోర్చుగల్‌లో 13, జపాన్‌లో 2, ఫ్రాన్స్‌లో 1, ఘపాలో 33, దక్షిణ కొరియాలో 3, నైజీరియాలో 3, బ్రెజిల్‌లో 2.నార్వేలో 2, అమెరికా, ఐర్లాండ్ , యూఎఈలలో ఒక్కో కేసు వంతున నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News