Monday, April 29, 2024

మౌలికానికి మహర్దశ

- Advertisement -
- Advertisement -

Nirmala-Sitharaman

రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు చేయాలి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

రూ.102 లక్షల కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: మౌలిక రంగానికి ప్రభుత్వం దాదాపు రూ.102 లక్షల కోట్లు కేటాయించింది. మంగళవారం మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వచ్చే ఐదేళ్లలో ఈ 102 లక్షల కోట్ల ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. మౌలిక రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని ఆమె గుర్తుచేశారు. మౌలిక రంగంలో పెట్టుబడులు పెట్టాలనే ప్రభుత్వ లక్షంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

గత ఆరేళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.51 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 5-6 శాతం. రాబోయే 5 సంవత్సరాల్లో దీని కోసం సుమారు రూ .100 లక్షల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులలో కేంద్రం, రాష్ట్రాలకు 39 శాతం వాటా చొప్పున ఉండగా, మిగిలిన 22 శాతం ప్రాజెక్టులు ప్రైవేటు రంగానికి చెందినవని ఆర్థిక మంత్రి చెప్పారు. 21 మంత్రులకు ఈ నిధి బాధ్యతలను కేటాయిస్తామని అన్నారు.

ఈ నిధితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి జరుగుతుందని సీతారామన్ వివరించారు. 2024 25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జిడిపి లక్ష్యాన్ని సాధించడమే దీని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద మౌలిక సదుపాయాల రంగానికి మొత్తం 102 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ.25 లక్షల కోట్లు ఇంధనానికి, రూ.20 లక్షల కోట్లు రహదారికి, రూ.14 లక్షల కోట్లు రైల్వే ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పిపిపి (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) కింద చేపట్టనున్నారు. ఇందులో ప్రైవేటు రంగ పెట్టుబడులు 22- నుంచి 25 శాతం ఉంటాయి. మిగిలిన పెట్టుబడులను ఎన్‌ఐపి ఇన్వెస్ట్‌మెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.

Centre unveils Rs 102 lakh crore of infra projects 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News