Tuesday, April 30, 2024

ప్రత్యేక ఆకర్షణగా ఒలింపిక్స్

- Advertisement -
- Advertisement -
tokyo-olympics
మెగా క్రీడలకు వేదికగా  2020

మన తెలంగాణ/క్రీడా విభాగం: వచ్చే ఏడాది ప్రపంచ క్రీడల్లోనే అతి పెద్ద క్రీడా సంగ్రామంగా చెప్పుకునే ఒలింపిక్స్ పోటీలు జరుగనున్నాయి. అంతేగాక ఆస్ట్రేలియా వేదికగా 2020లో ట్వంటీ20 క్రికెట్ ప్రపంచకప్‌లు కూడా నిర్వహించనున్నారు. పురుషులు, మహిళల విభాగంలో ఈ వరల్డ్‌కప్‌లు జరుగుతాయి. దీంతో పాటు ప్రతిష్టాత్మకమైన యూరో కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్, కొపా అమెరికా కప్ సాకర్ టోర్నీలు కూడా ఇదే జరుగుతున్నాయి. దీంతో పాటు ఇండీయన్ ప్రీమియర్ లీగ్, ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లు కూడా అలరించనున్నాయి. ఇక, వచ్చే ఏడాది ఒలింపిక్స్ క్రీడలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పతకాల కోసం పోటీ పడనున్నాయి. టోక్యో మహా నగరం ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది.

జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయి. ఇక, ఈ ఏడాది ఆరంభంలోనే వింటర్ యూత్ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. జనవరి 9 నుంచి 22 వరకు స్విట్జర్లాండ్ వేదికగా ఈ క్రీడలు జరుగనున్నాయి. అంతేగాక జనవరిలోనే వింటర్ గేమ్స్ కూడా జరుగుతాయి. దీనికి కెనడా దేశం వేదికగా నిలువనుంది. ఇక, టెన్నిస్‌లో ఎప్పటిలాగే ఈసారి కూడా నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్‌తో టెన్నిస్ సంగ్రామం మొదలవుతుంది. ఫిబ్రవరి నెలలో యూరప్ వేదికగా ఆరు దేశాల మెగా రగ్బీ ఛాంపియన్‌షిప్ కూడా జరుగనుంది. ఇందులో యుకె, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ తదితర అగ్రశ్రేణి జట్టు పోటీ పడుతున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి ఆస్ట్రేలియా వేదికగా మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. అంతేగాక ఫిబ్రవరిలోనే ప్రపంచ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ కూడా జరుగనుంది.

ఈ పోటీలు జర్మనీలో నిర్వహిస్తున్నారు. మరోవైపు మార్చి నెలలో చైనా వేదికగా ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జరుగనుంది. నాన్‌జిగ్ నగరంలో ఈ పోటీలు జరుగనున్నాయి. ఏప్రిల్ వరల్డ్ స్నూకర్ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తోంది. ఇక, మే నెలలో ప్రతిష్టాత్మకమైన ఐస్ హాకీ ప్రపంచకప్ జరుగనుంది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, లౌసానే వేదికలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.

అంతేగాక జూన్ 12 నుంచి నెల రోజుల పాటు యూరో కప్ సాకర్ పండుగ జరుగుతుంది. ప్రపంచకప్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ సాకర్ సంగ్రామానికి యూరప్‌లోని పలు నగరాలు వేదికగా నిలువనున్నాయి. ఫైనల్ లండన్‌లో జరుగుతుంది. అంతేగాక జూన్‌లోనే కొపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీకి తెరలేవనుంది. దీనికి అర్జెంటీనా, కొలంబియా దేశాలు దీనికి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక, అక్టోబర్ 18 నుంచి నవంబర్ 13 వరకు పురుషుల ట్వంటీ20 వరల్డ్‌కప్ జరుగనుంది. దీంతో పాటు జపాన్ వేదికగా పారా ఒలింపిక్స్ కూడా 2020లోనే జరుగనున్నాయి. ఇలా ఎన్నో మెగా క్రీడలకు కొత్త సంవత్సరం వేదికకానుంది.

tokyo olympics 2020

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News