Wednesday, June 12, 2024

క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి …

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/పాల్వంచ రూరల్ : ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అమదిపుచ్చుకొని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్ ఆకాంక్షించారు. మండల పరిధి కిన్నెరసాని మోడల్ స్పోర్ట్ పాఠశాలలో గేమ్స్, స్పోర్ట్ సమ్మర్ కోచింగ్ క్యాంపును డిడి మణెమ్మతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ … సమ్మర్ స్పోర్ట్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కోచింగ్‌లో పాల్గొనే విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యతను ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడల అధికారి బొల్లి గోపాల్‌రావు, ఏఎస్‌ఓ క్యాంపు ఇంచార్జి కొమరం వెంకటనారాయణ, ఏఎస్‌ఓఎస్ నాగేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం చందు, కోచ్‌లు పదం రాంబాబు, గొంది మారెప్ప, జే. నాగరాజు, జి. ప్రసాద్, కల్తి వెంకటేశ్వర్లు, సన్నం రామారావు, జి. వాసు, జి. దివ్య, బి. బాపనమ్మ, కే. నామణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News