Monday, April 29, 2024

అహంకారం ఉంటే ఏమవుతోందో తెలంగాణాయే ఉదాహరణ: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అహంకారం ఉంటే ఏమవుతోందని తెలంగాణలో చూశామని, ఎపిలో కూడా జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందన్నారు. తుఫాను రావడంతో రైతులకు భారీ నష్టం కలిగిందని తెలిపారు. తన పర్యటన ఖరారైతే కానీ సిఎం జగన్‌లో కదలిక రాలేదని చురకలంటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లాలో తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో బాబు పర్యటించారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగించారు.  పంట చేతికొచ్చే వేళ తుఫాను వచ్చి నష్టం మిగిల్చిందని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లేకే అధిక నష్టం వచ్చిందని, డ్రైనేజీల్లో పూడిక తీయకే పొలాల్లోకి మురికినీళ్లు వెళ్తున్నాయని, రైతులు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ అధికారులు ఎవరూ రాలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

45 ఏళ్లుగా తాను ఒక్క తప్పు కూడా చేయలేదని, తప్పు చేయకున్న తనని జైళ్లో పెట్టి క్షోభకు గురి చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తప్పు విమర్శలు చేయకూడదా? అని అడిగారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జైళ్లో పెడుతున్నారని, తుఫాను వల్ల ఎకరాకు రైతులు రూ.50 వేలు నష్టపోయారని, రైతులకు ఈ ప్రభుత్వం ఏవైనా ఇన్‌ఫుట్స్ ఇచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మనకు జరిగిన అన్యాయం పోరాడదామన్నారు. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించే బాధ్యత మాదని, వైసిపి పరిహారం ఇవ్వకపోతే మూడు నెలల తరువాత తానే ఇస్తానని, కౌలు రైతులకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News