Thursday, April 18, 2024

టీమిండియా వీరాభిమాని బామ్మ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Charulata-Patel

ముంబై: టీమిండియా క్రికెటర్లు బామ్మగా పిలుచుకునే అరుదైన క్రికెట్ ఫ్యాన్ చారులత మృతి చెందారు. కిందటి ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఈ బామ్మ టీమిండియా క్రికెటర్లను ప్రోత్సహించారు. ఓ మ్యాచ్ సందర్భంగా చక్రాల కుర్చీలో చారులత వువుజెలా ఊదుతూ కోహ్లి సేనను ఉత్సాహ పరిచారు. అప్పట్లో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. మరోవైపు మ్యాచ్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తదితరులు బామ్మ దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.

అంతేగాక మిగిలిన మ్యాచ్‌లను చూసేందుకు బామ్మకు టికెట్లు కూడా తీసిచ్చారు. కాగా, బామ్మ చారులత మృతి వార్తను ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. క్రికెట్ దాదీ ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించి సమాచారం ఇచ్చారు. ఇదిలావుండగా బామ్మ చారులత మృతిపై టీమిండియా కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు భారత క్రికెట్ బోర్డు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Charulata Patel passes away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News