Tuesday, April 30, 2024

ఓరియంట్ ఎలక్ట్రిక్ నుంచి లగ్జరీ షాండ్లియర్స్

- Advertisement -
- Advertisement -

Luxury-chandeliers

హైదరాబాద్: సికె బిర్లా గ్రూప్‌నకు చెందిన ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ సరికొత్త విలాసవంతమైన షాండ్లియర్స్‌ను ఆవిష్కరించింది. మూడ్ లైటింగ్‌తో పాటు ఉచిత ఇన్‌స్టాలేషన్, సేల్స్ తర్వాత సర్వీసింగ్‌ను అందిస్తోంది. ఓరియంట్ ఎలగాంజాలో గాలి ప్రసరణ, అద్భుతమైన షాండ్లియర్ రెండూ కలిపి సింగిల్ ఫిక్చర్‌గా వస్తాయి. వీటిలో మూడు రకాలు ఉన్నాయి. ఈ మూడు విభిన్నమైన సైజుల్లో, స్టైల్స్, రంగుల్లో ఉంటాయి. ఇవి వివిధ రకాల సెట్టింగ్స్‌లకు సరిపడేలా రూపొందించారు. గది అలంకరణకు సరిపోయేలా బ్లేడ్లు, 3-రంగుల ఎల్‌ఈడీ లైట్లను కలిగి ఉంటాయి. రిమోట్ కంట్రోల్ ఉపయోగించి అవసరానికి అనుగుణంగా లైటింగ్‌ను సులభంగా నియంత్రించవచ్చు.

లగ్జరీ షాండ్లియర్ల ధర రూ.17,500 ప్రారంభం అవుతుంది. ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు అతుల్ జైన్ మాట్లాడుతూ, భారతదేశంలో వినియోగదారుల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. వాటితో పాటు సంపన్న శ్రేణి వినియోగదారులు లగ్జరీ ఉత్పత్తుల్ని కోరుకుంటున్నారు. వారి డిమాండ్‌కు తగ్గట్లుగా వారి జీవనశైలి ప్రతిబింబించేలా ప్రపంచ స్థాయి లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని అన్నారు. లగ్జరీ జీవనశైలి ఇష్టపడేవాళ్లు ఇకపై టైర్ -1 నగరాలకు మాత్రమే పరిమితం కాలేదని, టైర్ -2, టైర్ -3 నగరాల్లో ఎక్కువగా ఉందన్నారు.

Luxury chandeliers from Orient Electric

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News