Saturday, April 20, 2024

టెలికాం కంపెనీలకు నిరాశ

- Advertisement -
- Advertisement -

Supreme-Court

ఎజిఆర్ రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
రూ.92,000 కోట్ల స్పెక్ట్రమ్ ఫీజులు చెల్లించాల్సిందే

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. జనవరి 23 నాటికి పాత బకాయిలు చెల్లించాలని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, గురువారం ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో టెలికాం కంపెనీలు రూ.92,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సర్దుబాటు స్థూల రాబడి (ఎజిఆర్) సమస్యపై బహిరంగ విచారణ కోసం వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ చేసిన విజ్ఞప్తిని కూడా సు ప్రీం కోర్టు కొట్టివేసింది. టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెం ట్ (డాట్)కు రూ.92,000 కోట్లు బకాయిలను చెల్లించాలన్న ఉత్తర్వులను సమీక్షించాలని రెండు సంస్థలు కోర్టు ను అభ్యర్థించాయి. లైసెన్స్, స్పెక్ట్రం ఫీజుల చెల్లింపును లెక్కించడానికి టెలికాం యేతర ఆదాయాన్ని కూడా ఎజిఆర్‌లో చేర్చాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 24న తీర్పు ఇ చ్చింది. ఈ నిర్ణయంతో టెలికాం కంపెనీల బకాయిలు పె రుగుతాయి.

ఈ కారణంగానే భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా సంస్థలు డిసెంబర్ నుండి చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ రెండింటి తర్వాత రిలయన్స్ జియో కూడా మొబైల్ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 24న కోర్టు తన ఉత్తర్వులలో డాట్ ఇచ్చి న ఎజిఆర్ నిర్వచనాన్ని సమర్థించింది. ఈ విధంగా టెలి కం కంపెనీలు, ప్రభుత్వం మధ్య 14 సంవత్సరాలుగా కొ నసాగుతున్న న్యాయ పోరాటం ముగిసింది. ఈ సంస్థలకు వారం క్రితం డాట్ డిమాండ్ లేఖలు జారీ చేసింది. ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న టెలికాం కం పెనీలకు ఉపశమనం ఇస్తూ స్పెక్ట్రం వాయిదాల చెల్లింపును రెండేళ్లపాటు వాయిదా వేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. 202021 నుంచి 202122 మధ్య రెండేళ్ల వరకు మినహాయింపు ఉంది.

ఈ నిర్ణయం టెలికాం సంస్థ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలకు రూ.42 వేల కోట్ల ఉపశమనం ఇస్తుంది. చార్జీలను పెంచినా ప్రయోజనమేమీ లేదని రేటింగ్ సంస్థ ఫిచ్ ప్రకటించింది. ఎజిఆర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రిలయన్స్ జియో ప్రభావితం కాదని కూడా తెలిపింది. 2020లో టెలికాం రంగానికి దృక్పథం ప్రతికూలంగా ఉందని, ఎజిఆర్ కారణంగా ప్రమాదం పెరిగిందని పేర్కొంది. కంపెనీలు చార్జీలు పెంచడం, స్పెక్ట్రం ఫీజు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి రెండేళ్ల సమయం పొందడం టెలికాం రంగానికి సానుకూలంగా ఉందని ఫిచ్ అంచనా వేసింది.

Supreme Court dismissing its review petition on AGR dues

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News