Sunday, March 3, 2024

భూమిలో నుంచి మంటలు… రోడ్డుపై మహిళ సజీవదహనం

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: నడిరోడ్డుపై మహిళ సజీవదహనమైన సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చూలియామీడు ప్రాంతంలో జె లీమా రోజ్ తన భర్త చనిపోవడంతో తన కుమారుడితో నివసిస్తుంది. లీమా స్థానిక ప్రైవేటు కాలేజీలో హౌస్ కీపర్‌గా పని చేస్తుంది. లీమా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా ఆమెకు చుట్టు మంటలు ఎగసిపడడంతో క్షణాల్లో ఆమె మంటల్లో కాలిపోయింది. స్థానికులు స్పందించి మంటలను ఆర్పేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాతపడింది. అండర్ గ్రౌండ్‌లో వేసిన విద్యుత్ తీగలతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ఎప్పుడు ఎక్కడ నుంచి ప్రమాదం వస్తోందో అర్థం కావడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమిళనాడు జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్పందించింది. తాము కేబుల్ వేసిన అనంతరం టెలికం కంపెనీ వాళ్లు గుంటలు తవ్వి కేబుళ్లు వేయడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని టెలికం కంపెనీలపై విద్యుత్ శాఖ బురద చల్లింది. స్థానికంగా సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. లీమాది సహజ మరణం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News