Saturday, April 27, 2024

8 గంటల్లోనే చిన్నారి కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

కిడ్నాప్‌కు గురైన బిన్నారి ఆచూకిని పోలీసులు 8గంటల వ్యవధిలోనే తెలుసుకుని తల్లిదండ్రు చెంతకు చేర్చారు. పాతబస్తీ మదన్నపెట్‌లో శనివారం రాత్రి ఓ ఆస్పత్రి నుంచి చిన్నారిని కిడ్నాప్ చేశారు. తొమ్మిది నెలల చిన్నారిని తల్లిదండ్రులు చంచల్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. అక్కడ ఆడుకుంటుండగా చిన్నారిని ఛత్తీస్‌గడ్‌కు చెందిన షెహనాజ్ పాపను కిడ్నాప్ చేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదన్నపేటు పోలీసులు దర్యాప్తు చేశారు.

ఆస్పత్రిలోని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితురాలు జహీరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. నిందితురాలు షెహనాజ్ ఖాన్ చంచల్‌గూడ నుంచి ఎంజిబిఎస్ వైపు వెళ్తున్న విషయం గమనించారు. అలాగే ఎంజిబిఎస్‌లో బస్సు ఎక్కిన విషయం తెలుసుకున్న మాదన్నపేట పోలీసులు వెంటనే జహీరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ వారు నిందితురాలు బస్సు దిగుతుండగా జహీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకొని పాపను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

పనిమనిషే నిందితురాలు…
పాతబస్తీ మదన్న పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంచల్‌గూడలోని నర్సింగ్ హోమ్ హాస్పిటల్‌లో 9 నెల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. ఆ ఇంట్లో పనిమనిషిగా ఉంటున్న చత్తీస్‌గఢ్‌కు చెందిన షహనాజ్ ఖాన్ ఇంట్లో పనులు ముగించుకొని పాపను తీసుకుని పరారీ అయ్యారు. షహనాజ్ ఖాన్ ఇచ్చిన ఐడి ప్రూఫ్ ప్రకారం చత్తీస్‌గఢ్‌కు చెందినట్లు గుర్తించారు. దీంతో బాధితులు మదన్న పెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఇంటి సమీపంలోని సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేసి కేసును చేధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News