Friday, March 29, 2024

భారత్‌కూ చైనా నిఘా బెలూన్ల తాకిడి?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బెలూన్లతో పొరుగుదేశం భారత్‌లో వేగు చర్యలకు చైనా పలుసార్లు యత్నించిందని ఇప్పుడు స్పష్టం అవుతోంది. సరిహద్దుల్లోని భారత్ సైనిక స్థావరాల లోగుట్టును పసికట్టేందుకు చైనా వాయుసేన ఆధ్వర్యంలోనే ఈ నిఘా బెలూన్లు రంగంలోకి దిగాయని, కేవలం భారతదేశమే కాకుండా జపాన్ , వియత్నాం, ఫిలిప్పిన్స్ వంటి పలు దేశాలలో సైనిక కదలికలకు , ఆయుధాల సమీకరణను ఎప్పటికప్పుడు తెలుసుకొంటోందని అమెరికా తెలిపింది. తమ దేశంలో చైనా బెలూన్ కదలికల తరువాత అమెరికా రక్షణ భద్రత సంస్థ పెంటగాన్ చైనా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తమ అధునాతన సాంకేతిక పరికరాలను నింపిన బెలూన్లను రంగంలోకి దింపిందని వెల్లడించింది.

పురాతన కాలం నుంచి చైనా తమ శత్రుపక్షాల కదలికలను కనుగొనేందుకు ఈ గాలిగుమ్మటాల పద్థతిని విశేషంగా వాడుతోంది. దీనికి ఇప్పుడు అధునాతన హంగులను జోడించి కొత్త రకం బెలూన్లను రంగంలోకి దింపినట్లు, హెవియన్స్ ప్రావియన్స్‌ను ఇందుకు చైనా తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నట్లు పెంటగాన్ నిర్థారించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చైనాకు చెందిన బెలూన్లు ఐదు ఖండాలలో కన్పించినట్లు, ఇప్పుడు తాము కూల్చేసిన చైనా బెలూన్ క్రమంలో చైనా బెలూన్ల గూఢచార్యం గురించి పూర్తిస్థాయిలో నిర్థారణ అయినట్లు సైనికాధికారులు తెలిపినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక తెలిపింది. అయితే చైనా బెలూన్ల అంశంపై భారత రక్షణ శాఖ కానీ సైనిక వర్గాలు కానీ ఎటువంటి స్పందనా వెలువరించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News