Saturday, September 30, 2023

రూ.793 కోట్ల ఆస్తుల జప్తు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో ఎపి సిఐడి దూకుడు పెం చింది. ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శికి చెం దిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను సోమవారం నాడు ఎపి సిఐడి అటాచ్ చేసింది. మార్గదర్శిలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్‌మెన్, ఆడిటర్లు కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు పేర్కొంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ద్వారా సేకరించిన డబ్బులను హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీసు ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించింది. ఎపిలో 37 బ్రాంచ్‌ల ద్వారా మార్గదర్శి బిజినె స్ చేస్తోందని,

ఎపిలో మార్గదర్శికి సంబంధించిన 1989 చిట్స్ గ్రూప్‌లు, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూప్‌లు ఉన్నాయని తెలిపింది. ఎపిలో వసూలు చేసిన చిట్స్‌ను ఇతర ప్రాంతాల్లోని కంపెనీలకు తరలించారని మార్గదర్శిపై అభియోగం ఉంది. ప్రస్తుతం క్లైయింట్స్‌కి డబ్బులు ఇచ్చే స్థితిలో మార్గదర్శి చిట్స్ లేదని సిఐడి అధికారులు పేర్కొన్నారు. కాగా, మార్గదర్శి కేసులో ఎ1గా రామోజీరావు, ఎ2గా శైలజ ఉన్నారు. ఆర్‌బిఐ నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శి కార్యకలాపాలు నిర్వహించినట్లు సిఐడి ఆరోపిస్తోంది. ఖాతాదారుల డబ్బును వివిధ రంగాలకు మార్గదర్శి మళ్లించినట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News