Saturday, April 20, 2024

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎంపికపై సిఎం నజర్

- Advertisement -
- Advertisement -

 mayors and chairpersons

 

రెండేసి పేర్లను సూచించాలని స్థానిక పార్టీ వర్గాలకు కెటిఆర్ ఆదేశం
అంతిమ జాబితా ఖరారు చేసిన ముఖ్యమంత్రి

భైంసా, జల్‌పల్లి మినహా మిగతా చోట్ల అధికార పీఠాల కైవసానికి టిఆర్‌ఎస్ వ్యూహం
స్వతంత్ర, ఎక్స్‌అఫిషియో ఓట్ల మద్దతుతో టిఆర్‌ఎస్ కైవసం కానున్న నిజామాబాద్, ఖానాపూర్ కార్పొరేషన్లు

హైదరాబాద్ : రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌లను దక్కించుకునేందుకు టిఆర్‌ఎస్ వ్యూహాన్ని సిద్దం చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఒక చైర్మన్ పదవి కూడా దక్కకుండా సిఎం కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యూహాలకు మరిం త పెదనుపెట్టారు. చైర్మన్లను దక్కించుకునేందు కు అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధులను కూడా తమ వైపుకు తిప్పుకునే కీలక బాధ్యతలను జి ల్లా మంత్రులకు అప్పగించారు. కాగా మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ చైర్మన్లు గెలుచుకునే జల్‌ప ల్లి, భైంసా మున్సిపాలిటీల విషయంలో మాత్ర ం వేచి చూసే ధోరణితో ఉండాలని భావిస్తోంది. ఇక బిజెపి అధిక డివిజన్లను గెలుచుకున్న నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఖానాపూర్ మున్సిపాలిటీని కూడా గెలుచుకునేందుకు పలువురు స్వంతంత్ర అభ్యర్ధులతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులను రంగంలోకి దించింది.

వీటితో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, మేయర్ అభ్యర్ధల ఎంపిక ప్రక్రియను కూడా దాదాపుగా పూర్తి చేసింది. ఈప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు కొ నసాగింది. మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో కెటిఆర్ అభిప్రాయాలను సేకరించిన అనంతరం జాబితాను రూపొందించి పార్టీ అధినేత సిఎం కెసిఆర్‌కు అందజేశారు. దానిపై సిఎం కెసిఆర్ మరోమారు పరిశీలించి అర్థరాత్రి తుది జాబితాను ఖరా రు చేశారు. ఈ జాబితాను సంబంధించ జిల్లామంత్రులకు గోప్యంగా అందచేసినట్లు సమాచారం. కాగా ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే ఛైర్‌పర్సన్‌ల పైకూడా టిఆర్‌ఎస్ దృష్టి సారించింది. ఆ పార్టీకి చెక్‌పెట్టే విధంగా వ్యూహాలను సైతం సిద్దం చేశారు. ఆ మున్సిపాలిటీల చైర్‌పర్సన్లను గెలుచుకునేందుకు అవసరమైన ఎక్స్‌అఫిషియో సభ్యుల ఓట్లను వినియోగించుకోవాలని సిఎం కెసిఆర్ పార్టీ నాయకులకు ఆదేశించారు.

షీల్డ్ కవర్‌లో పేర్లు ఉంటాయా?
120 మున్సిపాలిటీల్లో 111మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్ అత్యధిక మెజారిటీ సాధించి ఛైర్మన్ ఎంపిక క్లియర్‌గా ఉన్నప్పటికీ కొన్ని మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పదవికి పోటీ అధికంగా ఉండటం, రెబల్స్ గెలవండం, ఇంటిపెండెంట్ లు కూడా విజయం సాధించిన అంశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మున్సిపాలిటీల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు కెటిఆర్ సోమవారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి నియోజక వర్గాల ఇన్‌ఛార్జీలు, స్థానిక శాసన సభ్యులతో మాట్లాడారు.

ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యేసమయానికి టిఆర్‌ఎస్ నుంచి నామినేషన్ వేసే వ్యక్తి సిద్ధంగా ఉండాలని, సమస్యలు ఉన్న మున్సిపాలిటీల్లో షీల్డ్ కవర్‌లో ఉన్న పేరును ఇన్‌ఛార్జీ ప్రకటిస్తారని చెప్పారు. అయితే సమస్యలు లేవని రెబల్స్, ఇండిపెండెట్లు పూర్తి స్థాయిలో టిఆర్‌ఎస్ పక్షానే ఉండటంతో సుమారుగా 111 మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఛైర్మన్‌లుగా ఎన్నికవుతారని నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు కెటిఆర్‌కు చెప్పారు. ఇప్పటివరకు స్పష్టంగా111 మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్‌కు మెజారిటీ ఉందని చెప్పారు.

ఎక్స్‌ఆఫిషియో సభ్యులు కీలకం
మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీని టిఆర్‌ఎస్ సాధించినప్పటికీ ఎక్కడైన ఛైర్మన్ ఎంపికకు మెజారిటీ తక్కువగా ఉంటే ఎక్స్‌ఆఫిషియోసభ్యులు కీలకం కానున్నారు. బిజెపి,కాంగ్రెస్ మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థులు నిలిపినా అక్కడ పూర్తి స్థాయిలో టిఆర్‌ఎస్ వార్డు సభ్యులు విప్‌తో సిద్ధంగా ఉండాలని టిఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశించింది. అలాగే మెజారిటీ తగ్గే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపి లు, రాష్ట్రంలో పార్టీ సూచించిన ప్రాంతాల్లో రాజ్యసభసభ్యులు ఛార్మన్ ఎంపిక కోసం ఓటు వేసేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని కెటిఆర్ ఆదేశించారు.

ఎక్స్ ఆఫిషియోసభ్యులుగా టిఆర్‌ఎస్‌కు 89 మంది శాసనసభ్యులు, 9మంది పార్లమెంట్ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వారితో పాటు, ఎంఐఎంతో కలిసి 39 మంది శాసనమండలి సభ్యులు, ఇతర పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన శాసనసభ్యులు, స్నేహంగా ఉన్న 7 గురు ఎంఐఎం సభ్యులు టిఆర్‌ఎస్‌కు బలంగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫిషియోసభ్యు లు కెటిఆర్ ఆదేశాలమేరకు పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఎక్స్ ఆఫిషియోసభ్యుల వ్యవహారం అంతా గుమ్మనంగానే ఉంటుంది. అవరమైనప్పుడే వీరు రంగప్రవేశం చేసేవిధంగా టిఆర్‌ఎస్ రాజకీయ వ్యూహం రచించింది. పురపాలక పీఠానికి కావల్సిన బలం, అవసరం అయిన మున్సిపాలిటీల్లో వీరి ఓటు కీలకం కానుంది.

రెండు పేర్లను పరిశీలిస్తున్న అధిష్ఠానం
నేడు జరగనున్న మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం టిఆర్‌ఎస్ వర్కింగ్ పెసిడెంట్ కెటిఆర్ రెండు పేర్ల చొప్పున పంపాలని నియోజక వర్గాల ఇన్‌ఛార్జీలను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈ మేరకు ప్రాథమిక జాబితాను సిద్ధంచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కెటిఆర్ దగ్గర సిద్ధంగా ఉన్న జాబితాతో ఈ జాబితాను పరిశీలించి ఒక జాబితాను సిద్ధం చేస్తారు. ఆ జాబితాను టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలించి నేడు మధ్యాహ్నం లోగా పేర్లను నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు ఫోన్‌ద్వారాకానీ షీల్డ్ కవర్‌లో కానీ తెలుపుతారు. అవసరాన్ని, అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకుంటారు. అయితే 111 మున్సిపాలిటీల్లో ఎంపిక ప్రక్రియ సులభంగానే అవుతుందని టిఆర్‌ఎస్ అధిష్ఠానం భావిస్తోంది. ఎక్స్‌అఫిషియో సభ్యులు, ఇండిపెండెంట్లతో అత్యధిక మెజారిటీతో ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పారు.

విప్ ప్రవేశపెట్టనున్న టిఆర్‌ఎస్
నేడు మధ్యాహ్నంలోగా ధిష్ఠానం ఆదేశాల మేరకు ఎ ఫారాలు పొందిన నియోజక వర్గాల ఇన్‌ఛార్జీలు, స్థానిక శాసన సభ్యులు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఎంపికైన ఒకరిని మొదట విప్‌గా ఎంపికచేసి ఎ-3 ఫారం ఇస్తారు. విప్ ఛైర్మన్ అభ్యర్థిని ప్రకటించి పార్టీనుంచి గెలిచిన వార్డుసభ్యులు, కార్పేటర్ల మద్దతు కోరుతారు. ఈ విధంగా ఎంపిక ప్రక్రియ నేడు మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది. విప్ పొందిన సభ్యుడు తప్పనిసరిగా టిఆర్‌ఎస్ అధిష్టానం సూచించిన అభ్యర్థిని ఎన్నుకోవాలి.

కార్పొరేషన్ల మేయర్లు ఎవరు?
కార్పొరేషన్లలో స్పష్టమైన మెజారిటీ సాధించిన టిఆర్‌ఎస్ మేయర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. మేయర్ అభ్యర్థులకోసం ఇప్పటికే ఇన్‌ఛార్జీలు పంపించిన రెండు పేర్లను పరిశీలించి టిఆర్‌ఎస్ అధిష్టానం దగ్గర ఉన్న జాబితాను కూడా పరిశీలించి దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే నేడు ఉదయం ఈ పేర్లను టిఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటించనుంది. అయితే ముందస్తుగా ఎట్టిపరిస్థితుల్లోనూ వెల్లడి చేయవద్దని టిఆర్‌ఎస్ అధిష్ఠానం నియోజక వర్గాల ఇన్‌ఛార్జీలను ఆదేశించింది.

అయితే నిజమాబాద్‌లో టిఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ సాధ్యం కానిపక్షంలో ఎంఐఎం, ఎక్స్ ఆఫిషియో సభ్యులను రంగంలోకి దించేందుకు టిఆర్‌ఎస్ చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థులతో పాటు డిప్యూటీమేయర్ ఇతర పోస్టులను టిఆర్‌ఎస్ సాధించనుంది. అయితే బైంసా మున్సిపాలిటీలో ఎంఎఐఎంతో కలిసి ఎక్స్ ఆఫిషయోసభ్యుల ఓటుతో టిఆర్‌ఎస్ గెలిచే అవకాశాలున్నాయి. అలాగే జల్‌పల్లి మున్సిపాలిటీలో ఎంఐఎంకు మెజారిటీ ఉండటంతో ఆస్థానంలో ఎంఐఎంనే టిఆర్‌ఎస్ బలపర్చనుందనే సమాచారం ఉంది.

CM focus on selection of mayors and chairpersons
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News