Friday, September 19, 2025

తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్నసిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR reached Telangana Bhavan

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ద‌స‌రా పూజ‌ల అనంత‌రం క‌ర్నాట‌క మాజీ సిఎం కుమార‌స్వామి, ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి కెసిఆర్ పార్టీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపిలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరయ్యారు. మధ్యాహ్నం 1.19 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ముఖ్యమంత్రి బ‌య‌ట‌కు రాగానే టిఆర్ఎస్ మ‌హిళా నేత‌లు పూల‌తో ఘనస్వాగ‌తం ప‌లికారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి తెలంగాణ భ‌వ‌న్ వ‌ర‌కు టిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున‌ ”దేశ్ కీ నేత” అని నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News