Thursday, May 2, 2024

గుండెల నిండుగా.. పదేండ్ల పండుగ

- Advertisement -
- Advertisement -

నేడు స్వయం పాలన ఫలాలు ప్రజలకు అందుతున్నవి. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లెపల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకుందాం. ఒకనాడు కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణలో నేడు విద్యుత్ రంగాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో రాష్ట్రం వెలుగులు విరజిమ్ముతున్నది. ఇదంతా ఎంతగానో కష్టపడితే తప్ప సాధ్యం కాలేదు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలి.

జూన్ 2న రాష్ట్ర సచివాలయంలో ఆరంభం
21రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది గొప్ప
సందర్భం నాడు అవమానాలు,
అపోహలు.. నేడు అభివృద్ధి వెలుగులు
విద్యుత్తు, వ్యవసాయం సహా ప్రతి రంగంలో
దేశానికే ఆదర్శం కఠోర శ్రమతోనే
ఈ విజయాలు సాధ్యం ప్రజల
భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా
దశాబ్ది ఉత్సవాలు ఈ మూడు వారాలు
మమేకం కావాలి ఆటాపాటలతో
పండుగలా సాగాలి ఉన్నతస్థాయి
సమావేశంలో బిఆర్‌ఎస్ అధినేత,
ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం

తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని చాటుతూ
పల్లెపల్లెనా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు

మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగం లో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల ప్రారంభ వేడుకలను జూన్ 2న డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంeలో నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ సంబంధిత అంశాలపై శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జ రిగింది. ఈ నేపథ్యంలో అవతరణ దినోత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాలను ఏ వి ధంగా నిర్వహించాలో ఉన్నతాధికారులతో సిఎం చ ర్చించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడు తూ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొ ప్ప సందర్భమని వ్యాఖ్యానించారు. ఒకనాడు అనేక అవమానాలకు, అపోహలకు గురైన తెలంగాణ నేడు అత్యద్భుతంగా వెలుగొందుతున్నదని పేర్కొన్నారు. వి ద్యుత్తు, వ్యవసాయంతో సాగునీరు సహా ప్రతి రంగంలో దేశానికే ఆదర్శంగా ప్రగతిని నమోదు చేసుకుంటూ పోతున్నదని చెప్పారు.

ప్రజలకు పాలన ఫలాలు
నేడు స్వయం పాలన ఫలాలు ప్రజలకు అందుతున్నవని, పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానా న్ని పల్లె పల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఒకనాడు కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణ లో నేడు విద్యుత్ రంగాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతున్నదని చెప్పారు. 24 గంటల విద్యుత్తును రైతాంగానికి ఉచితంగా, నిరంతరాయంగా అందిస్తున్నామని, ఇదంతా ఎంతగానో కష్టపడితే తప్ప సాధ్యం కాలేదని తెలిపారు. ఇవే విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో కరెంటు లేక తెలంగాణలో ఎక్కడ చూసినా ఇన్వర్టర్లు, కన్వర్టర్లే కనిపించేవని, వంగిపోయిన కరెంటు స్తంభాలు ప్రమాదాలకు కారణమవుతుండేవని పేర్కొన్నారు.

వేలాడే కరెంటు తీగలు ప్రజల ప్రాణాలను హరించేవని, ఇండ్ల మీది నుంచే విద్యుత్ లైన్లు పోయినా నాడు పట్టించుకునే దిక్కే లేకుండేదని గుర్తు చే శారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా దృ ఢంగా నిలిచిన కరెంటు స్తంభాలు, విద్యుత్‌ను నిరంతరాయంగా ప్రసారం చేస్తున్న నాణ్యమైన కరెంటు వైర్లు, అడుగడుగునా ట్రాన్స్ ఫార్మర్లు ప్రజలకు అందుబాటులోకి వ చ్చాయని వివరించారు. గత పాలనలో విస్మరించబడిన వి ద్యుత్ ఉత్పాదన, ప్రసార వ్యవస్థలను దార్శనికతతో, పట్టుదలతో పటిష్టపరుచుకోవడం ద్వారానే విద్యుత్ విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. ఈ విష యం తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి వచ్చిందని సిఎం అన్నారు.

పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ధి ఉత్సవాలు
విద్యుత్ రంగం మాదిరే తెలంగాణ ప్రభుత్వం పటిష్టపరిచిన వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ప్రతి రంగంలో సాధించిన అభివృద్ధిని పేరు పేరునా ప్రజలకు పలు ప్రసార మాధ్యమాలు, మార్గాల ద్వారా చేరవేయాలని సిఎం కెసిఆర్ దిశానిర్ధేశం చేశారు. స్వరాష్ట్ర సాధన ఫలాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలతో ఈ మూడు వారాల పాటు మమేకం కావాలని, వారి భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ధి ఉత్సవాలను ఆటాపాటలతో పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని సిఎం పునరుద్ఘాటించారు. అదే సందర్భం లో జూన్ 2 ప్రారం భం నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకలను డా. బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో సచివాలయంలో స్టేజి ఏర్పాటు సహా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండా ఎగురవేయడం తదితర అధికార కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించి సిఎం కెసిఆర్ చర్చించారు.

ఆహ్వానితులకు పా ర్కింగ్ సౌకర్యం, అతిథులకు హై టీ ఏర్పాటు వంటి కార్యక్రమాలను ఎక్క డ, ఎట్లా నిర్వహించాలో వివరిస్తూ ఉన్నతాధికారులకు సిఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాల ఏర్పాట్ల గురించి సిఎం కెసిఆర్ చర్చించారు. మంత్రు లు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎం ఎల్‌ఎలు జీవన్ రెడ్డి, సిఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమా ర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ శాంతి కుమారి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ న ర్సింగ్ రావు, డిజిపి అంజనీకుమార్, హైదరాబాద్ సిపి సి వి. ఆనంద్, సిఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపా ల్ రె డ్డి, ఆర్ అంబ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, ఐ అండ్ పి ఆర్ కమిషనర్ అశోక్‌రెడ్డి, జాయింట్ డైరక్టర్ జగన్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News