Friday, September 19, 2025

నేడు జార్ఖండ్‌కు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR visit Jharkhand Today

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కెసిఆర్ శుక్రవారం ఝార్కండ్‌కు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర రాజధాని రాం చీలో గాల్వాన్ అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పు న పరిహారం ఇవ్వనున్నారు. 2020 జూన్ 15న చైనా సైని కులతో జరిగిన ఘర్షణల్లో మన చెందిన 20 మంది సైనికులు వీరోచితంగా పోరాడి అమరులైన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్‌బాబుతో సహా మరో 19 మం ది వీరమరణం పొందారు. దీనిపై ప్రధానమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ ఈ మేరకు పరిహారం ప్రకటించారు. సంతోష్ బాబుకు ఐదు కోట్లు, మిగతా 19 మం ది సైనికుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థి కసాయాన్ని ప్రకటించారు. గతంలోనే సూర్యాపేటలోని సంతోష్ బాబు ఇంటికి వెళ్లిన సిఎం కెసిఆర్ పరిహారంతో పాటు ఆయన సతీమణికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. మిగిలిన 19 మంది అమరుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది . ఈ నేప థ్యంలో సిఎం కెసిఆర్ నేరుగా వెళ్లి ఆ కుటుంబాలకు పరిహారం అందించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News