Sunday, April 28, 2024

వార్డు సభ్యుడికి పదవీ గండం

- Advertisement -
- Advertisement -

ward members

 

హోదాతో వచ్చే బాధ్యతలను విస్మరిస్తే
నాటిన మొక్కలు 85 శాతం కన్నా తక్కువగా బతికితే
పారిశుద్ధ్యం, వ్యర్థాల సేకరణపై పర్యవేక్షణ చేయకపోతే
వార్డు సభ్యులను తొలగించే అధికారమున్న కలెక్టర్ లేదా ప్రభుత్వం

హైదరాబాద్ : పురపాలక సంఘంలో హరిత క్రియ ప్రణాళిక (గ్రీన్ యాక్షన్ ప్లాన్)ను విస్మరిస్తే వార్డు సభు.్యలకు పదవీ గండం పొంచి ఉన్నది. తెలంగాణ కొత్త మున్సిపల్ చట్టం 2019 ప్రకారంగా పురపాలక సంఘంలో హరిత క్రియ ప్రణాళికకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారంగా ప్రతి వార్డు సభ్యుడు తమతమ వార్డుల్లో గ్రీన్ యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు పరచాలి. మొక్కలు నాటడం, మనుగడ సాధించడంలో వార్డు సభ్యులు ఎలాంటి నిర్లక్షం చేసినా ఆ జిల్లా కలెక్టర్ నేరుగా ఓ ప్రకటనను వెలువరించి చర్యలు తీసుకునే అవకాశాన్ని చట్టం కల్పిస్తున్నది. దీంతో వాస్తవంగా ప్రజలకు సేవ చేయాలనుకునే వారే ఈ ఎన్నికల్లో నిలవాలనే ఉద్దేశ్యాన్ని కొత్త మునిసిపల్ చట్టం సున్నితంగా హెచ్చరికను జారీచేస్తున్నది. 5 సంవత్సరాలుండే వార్డు సభ్యుల పదవీ కాలంలో ప్రతి ఏటా మున్సిపల్ వార్షిక బడ్జెట్‌లో గ్రీన్ యాక్షన్ ప్లాన్‌కు కేటాయించిన నిధులను వినియోగించాలని, ఆ నిధులను దుర్వినియోగం చేసినా, నిర్లక్షం చేసినా, బాధ్యతలను విస్మరించినా వార్డు సభ్యులను తొలగించే అధికారాన్ని ప్రభుత్వం కలిగి ఉన్నది.

గ్రీన్ యాక్షన్ ప్లాన్
జిల్లా కలెక్టర్ సారథ్యంలో జిల్లా స్థాయి గ్రీన్ యాక్షన్ ప్లాన్ కమిటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి జిల్లా అటవీ అధికారి లేదా తత్సమానమైన హరితహారం ఇన్‌చార్జిగా ఉండేవారుంటారు. వార్డు వారిగా, మున్సిపాలిటీల వారిగా సంవత్సరం వారిగా 5 సంవత్సరాలకుగానూ గ్రీన్ యాక్షన్ ప్లాన్‌ను కమిషనర్ రూపొందిస్తారు. మున్సిపాలిటీ గ్రీన్ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మొక్కలు నాటడం, వాటి పురోగతికి పాటుపడటం స్థానిక వార్డు సభ్యుడు పూర్తిబాధ్యత వహించాలి. వారు పరిధిలో నాటిన మొక్కలు 85 శాతం మనుగడ సాధించేలా చూడాలి.

వార్డుల్లో నాటిన మొక్కలను, వాటి మనుగడను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా ఫ్లైయింగ్ స్క్వాడ్‌లుంటారు. 85 శాతం కన్నా తక్కువగా మనుగడ సాధించిన మొకలున్న వార్డులో వార్డు సభ్యుడి ప్రవర్తనా ప్రమేయములేకుండా ఉండినా, మొక్కల మనుగడ చాలా తక్కువగా ఉన్నా వార్డు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిచే అధికారాన్ని జిల్లా కలెక్టర్ కలిగి ఉన్నారు.

వార్డు సభ్యుడు బాధ్యతలు
తమ వార్డు పరిధిలో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు క్రమంగా నిర్వహణా ఉండాలి. స్థానికంగా ఇం టింటి నుంచి, స్థాపించబడిన వ్యాపార కేంద్రాల నుంచి వ్యర్థాల సేకరణ జరిగేలా చేయాలి. వార్డు పరిధిలో జిల్లా స్థాయి కమిటి నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటడం, అవి మనుగడ సాధించడం 85 శాతానికి తక్కువగా కాకుండా ఉండాలి. అవసరంలేని ప్రాంతాల్లో ఆదాయంలేని నీటి వాడకాన్ని తగ్గించడం, నష్టమవుతోన్న నీటి సరఫరాను తగ్గించడం, పవర్ బోర్ల వాడకాన్ని లేకుండా చేయాలి. నీటి వనరులను రక్షణకవచాలు, రక్షించడంచేయాలి. మున్సిపాలిటీని మోడల్ టౌన్‌గా మార్చదానికి వార్డు మెంబర్ కృషిచేయాలి. వార్డు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంరతం వచ్చే హోదాతో సంక్రమించే బాధ్యతలను విస్మరిస్తే వార్డు సభ్యుడిని తొలగించే అధికారాన్ని కొత్త మున్సిపల్ చట్టం 2019లో సెక్షన్ 67లో ఉపసెక్షన్ (జి) స్పష్టంచేస్తున్నది.

Collector who has power to remove ward members
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News