Wednesday, April 24, 2024

ఘోర విమాన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

 flight risk

 

176 మంది దుర్మరణం

ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం
విమానంలో 82మంది ఇరాన్, 63 మంది కెనడా పౌరులు
లభించిన బ్లాక్ బాక్సులు
వాటిని అమెరికాకు ఇవ్వబోం : ఇరాన్

టెహరాన్: ఏడు దేశాలకు చెందిన 176 మంది ప్రయాణికులున్న ఉక్రెయిన్ విమానం బోయింగ్ 737 బుధవారంనాడు టెహరాన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానంలో ఉన్నవారంతా మరణించారు. టెహరాన్ నుం చికీవ్‌కు వెళ్లాల్సిన ఈ విమానంలో ఎక్కువమంది ఉక్రెయిన్ దేశీయులు కారు. ప్రయాణికుల్లో 82 ఇరాన్‌కు, 63 మంది కెనడాకు చెందినవారని అధికారులు తెలిపారు. మధ్యప్రాచ్యంలో తారస్థాయిలో ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహరాన్ క్షిపణులతో దాడి ప్రారంభించిన కాసేపటికే ఉక్రెయిన్ విమానం బోయింగ్ 73 7 కూలిపోయింది.

అయితే ఈ ప్రమాదం వెనక ఏమైనా కు ట్ర జరిగిందా అన్న కోణంలో తక్షణ సమాచారమేదీ లభించలేదు. బోయింగ్ 737 కూలినచోట విమాన శిథిలాల నుంచి మంటలు, దట్టమైన పొగ అలముకున్నట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ఫుటేజ్‌లో కనిపించింది. విమానం నేలను ఢీకొన్న తర్వాత మంటలు వచ్చాయని మీడియా తెలిపింది. కానీ విమానంలో అంతకు ముందే మంటలు రేగినట్టు ఫుటేజ్‌లో కనిపించింది.

శిథిలాల నుంచి …
సహాయ చర్యలు చేపట్టినవారు శిథిలాల నుంచి బాడీ బ్యాగులు, ప్రయాణికుల వ్యక్తిగత వస్తువులు సేకరించారు. వాటిలో ఒక సాంటా క్లాజ్ బొమ్మ, బాక్సింగ్ గ్లవుజ్ కూడా దొరికాయి. ఈ ప్రమాదంలో ఎవరూ బతికి ఉండకపోవచ్చని ఇరాన్, ఉక్రెయిన్ అధికారులు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. కాగా, ఉదయం 6.10 గంటలకు బయలుదేరిన పిఎస్ 752 సర్వీస్ ఫ్లైట్ టేకాఫ్ అయిన రెండు నిముషాలకే రాడార్ తెరపై నుంచి అదృశ్యమైందని ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (యుఐఎ) తెలిపింది. ఎయిర్ పోర్ట్‌కు వాయవ్య దిశలో 45 కిలోమీటర్ల దూరంలో షాహ్‌రియర్ కౌంటీలోని ఖలాజ్ అబాద్‌లో వ్యవసాయ క్షేత్రంలో విమానం నేలను ఢీకొన్నదని ప్రభుత్వ మీడియా తెలిపింది. విమాన సిబ్బంది పొరపాటు వల్ల ఇది జరిగి ఉండవచ్చని, అయితే వారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొంటే వారి బాధ్యత చాలా తక్కువని యుఐఎ ఉపాధ్యక్షుడు ఐగోర్ సోస్నోవ్‌స్కీ విలేకరులకు చెప్పారు.

వదంతులు వద్దు : ఉక్రెయిన్ ప్రెసిడెంట్
విమాన ప్రమాదంపై వదంతులు ప్రచారం చేయవద్దని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమైర్ జెలెన్‌స్కీ హెచ్చరించారు. విశ్రాంతికోసం ఓమన్ వెళ్లిన ఆయన హుటాహుటిన కీవ్ చేరుకున్నారు. ఇలా ఉండగా, యుఎస్ రిజిస్ట్రేషన్ ఉన్న క్యారియర్లు ఇరాక్, ఇరాన్, గల్ఫ్ మీదుగా ప్రయాణించడాన్ని అమెరికా వైమానిక సంస్థ నిషేధించింది. లుఫ్తాన్జా, ఎయిర్ ఫ్రాన్స్ సంస్థలు కూడా తమ విమానాల్ని ఇరాకీ, ఇరాన్ గగన తలంపై ప్రయాణించకుండా నిలిపేశాయి.

బ్లాక్ బాక్స్‌లు లభ్యం
కూలిన ఉక్రెయిన్ విమానం బ్లాక్ బాక్స్‌లను ఇరాన్ సహాయక, అన్వేషణ బృందాలు కనుగొన్నాయి. ‘ఈ ఉదయం (బుధవారం) కూలిన ఉక్రెయిన్ 737 విమానం బ్లాక్ బాక్సులు రెండు దొరికాయి’ అని విమాన సంస్థ ప్రతినిధి రెజా జాఫర్‌జడే చెప్పారు. ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానాన్ని 2016లో తయారు చేశారు. ప్రయాణానికి కేవలం రెండు రోజుల ముందే దీన్ని తనిఖీ చేశారు. ఇంజన్‌లో ఏర్పడిన సమస్య వల్లే విమానం కూలిందని ఇరాన్, ఉక్రెయిన్ అధికారులు మొదట విడుదల చేసిన ప్రకటనలు తెలిపాయి.

అమెరికాకు ఇవ్వం
ప్రమాదానికి గురైన బోయింగ్ 737 విమానం బ్లాక్ బాక్స్‌లను అమెరికాకు ఇవ్వబోమని ఇరాన్ విమానయా న సంస్థ ప్రకటించింది. ‘విమానాన్ని తయారు చేసిన బోయింగ్ సంస్థకు,అమెరికన్లకు బ్లాక్‌బాక్స్‌లను ఇవ్వం’ అని ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అధిపతి అలీ అబెద్‌జడేహ్ స్పష్టం చేసినట్టు మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘బ్లాక్ బాక్స్‌ను దర్యాప్తు కోసం ఏ దేశానికి పంపేదీ ఇప్పుడే చెప్పలేం’ అన్నారాయన. అంతర్జాతీయ వైమానిక నిబంధనల ప్రకారం. ఏ దేశంలో విమాన ప్రమాదం జరిగిందో ఆ దేశానికే దర్యాప్తు చేసే హక్కు ఉంటుందని చెప్పారు.

‘ఇరాన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతుంది. అయితే, దర్యాప్తు సమయంలో ఉక్రెయిన్‌లు కూడా ఉండవచ్చు’ అని అలీ అబెద్‌జడేహ్ సూచించారు. బ్లాక్ బాక్స్‌ల్ని కొన్ని దేశాలు అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా మాత్రమే విశ్లేషించగలవని నిపుణులు చెబుతున్నారు. బుధవారంనాటి విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్‌ల విశ్లేషణకు ఇరాన్ నుంచి తమకు అభ్యర్థన ఏదీ అందలేదని ఫ్రాన్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (బిఇఎ) తెలిపింది.

 

Deadly flight risk
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News