Friday, April 26, 2024

ప్రతీకారం

- Advertisement -
- Advertisement -

Iran missile

 

అంతం కాదిది ఆరంభమే – ఇరాన్ అధినేత ఖమేనీ

సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ భీషణ క్షిపణి దాడులు

80 మంది అమెరికన్ సైనికులు మృతి : ఇరాన్

టెహ్రాన్/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. జనరల్ ఖాసీం సులేమానీ దారుణ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినట్టుగానే ఇరాన్ చేసి చూపించింది. పొరుగుదేశం ఇరాక్‌లోని రెండు అమెరికా స్థావరాలపై మంగళవారం రాత్రి బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆ దేశంలోని అల్ అసద్, ఇర్బిల్ ఎయిర్‌బేస్‌లపై డజనుకుపైగా క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. ఈ విషయాన్ని టెహ్రాన్‌తో పాటు పెంటగాన్ కూడా ధ్రువీకరించింది.

దాడుల అనంతరం ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్(ఐఆర్‌జిసి) ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అమెరికన్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ‘ఆపరేషన్ అమరవీరుడు సులేమానీ’ని విజయవంతంగా చేపట్టాం. సులేమానీ దారుణ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాం. ఉపరితలం నుంచి ఉపరితాలనికి ప్రయోగించే డజన్లకొద్దీ క్షిపణులతో విరుచుకుపడ్డాం. అల్ అసద్, ఇర్బిల్ స్థావరాల్లోని అమెరికా ఉగ్రవాద ఆర్మీని లక్షంగా చేసుకున్నాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 80 మంది ‘అమెరికా ఉగ్రవాదులు’ మరణించారని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రయోగించిన 15 క్షిపణులు లక్ష్యాల్ని ఛేదించడంలో సఫలమయ్యాయని తెలిపింది. ఈ దాడిలో అమెరికా హెలికాప్టర్లు, సైన్యం సామాగ్రి పూర్తిగా ధ్వంసమైనట్లు పేర్కొంది. అదే విధంగా ఈ దాడులకు ప్రతిగా అమెరికా ఎదురుదాడికి దిగితే సమాధానం చెప్పడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా చర్యలను తిప్పికొట్టేందుకు ఇరాక్‌లో మరో 100 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ వర్గాలు తెలిపాయని పేర్కొంది. మరోవైపు ఇరాన్ దాడులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు.

‘ఆల్ ఈజ్ వెల్. బుధవారంనాడు ప్రకటన చేస్తా’ అని ట్వీట్ చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఎంతనష్టం జరిగిందనేదానిపై అం చనా వేస్తున్నట్టు పెంటగాన్ ప్రకటించింది. సరియైన సమయంలో బదులిస్తామని హెచ్చరించింది. ఇప్పుడు అందరి దృష్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందనపై కేంద్రీకృతమైంది. ఇరాన్ విషయంలో అగ్రదేశం ఎలా స్పందిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇరాన్ దాడులు జరిపిన ప్రాంతాల్లో 80మంది అమెరికా సైనికులు మృత్యువాత పడిన విషయం నిజమే అయితే అమెరికా తీవ్రమైన చర్యలకు దిగే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇది ఆరంభమే.. ఇంకా ముందుంది : ఖమేనీ
అమెరికా స్థావరాలపై మంగళవారం రాత్రి జరిపిన క్షిపణి దాడులపై ఇరాన్ సుప్రీం కమాండర్, అగ్రనేత అయతోల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇరాన్‌లోని పవిత్రమైన ఖోమ్ నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సులేమానీ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖమేనీ మాట్లాడారు. మేం ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేశామని పేర్కొన్నారు. ఈ దాడులతో మనలో కూడా తిరుగుబాటు ఇంకా బతికే ఉందని నిరూపించామని సులేమానీ నివాళి కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి వెల్లడించారు.

ఈ క్షిపణి దాడులు అమెరికాకు చెంపపెట్టు అన్నారు. మనం చేసే ప్రతీకార దాడులు, సైనిక చర్యలు ఇరాక్‌కు జరిగిన నష్టాన్ని పూరించలేవని తెలిపారు. అమెరికా స్థ్ధావరాలపై జరిగిన దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని మున్ముందు ఇలాంటివి చూడడానికి అమెరికా సిద్ధంగా ఉండాలని ఖమేనీ హెచ్చరించారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఉనికికి ముగింపు పలకడమే మన కర్తవ్యమని ఖమేనీ పేర్కొన్నారు.

దాడుల గురించి ఇరాన్ ముందే చెప్పింది : ఇరాక్
తమ దేశంలోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులకు దిగేముందు ఇరాన్ తమకు అధికారికంగా సమాచారం అందించిందని ఇరాక్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాక్ ప్రధానమంత్రి కార్యాలయం బుధవారంనాడు ఒక ప్రకటన విడుల చేసింది. సులేమానీ హత్యకు ప్రతీకారంగా కొన్ని చర్యలకు దిగబోతున్నామని, అది త్వరలో ప్రారంభం కాబోతుందని, ఇరాక్‌లోని కొన్ని పరిమిత ప్రదేశాల్లోని అమెరికా స్థావరాలపై ఆ దాడులు ఉంటాయని తమకు చేరవేసిన సమాచారంలో ఇరాన్ స్పష్టం చేసినట్లు తెలిపింది.

Iran missile strikes on American bases
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News