Thursday, May 2, 2024

ధరణిపై కమిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణ యాలు తీసుకుంటోంది. తాజాగా సిఎం రేవంత్ మరో నిర్ణయం తీసుకున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమి టీని ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం జిఒ 3లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ పీటర్, భూ చట్టాల నిపుణులు, అడ్వకేట్ భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, సిసిఎల్‌ఎ మెంబర్ కన్వీనర్ ను నియమించింది. ఈ కమిటీ ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలను రెడీ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

ధరణి పోర్టల్లో చేయాల్సిన మార్పులకు సంబంధించి ఈ కమిటీ నివేదిక అందించనుంది. ధరణి పోర్టల్‌తో లక్షల్లో పెండింగ్ సమస్యలు ప్ర భుత్వం పేరుకుపోయాయి. అయితే ధరణి పోర్టల్ స్థానంలో ‘భూ మాత’ వెబ్‌పోర్టల్‌ను ప్రవేశపెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి కే ప్రకటించింది. కానీ, ఆ మార్పుతో పాటు భూ సమస్యల పరిష్కా రం వంటి అంశాలపై ఇప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవ కాశాలు లేకపోవడంతో 2017 లో చేసిన పొరపాట్లను పునరావృ తం కాకూడదని ప్రభుత్వం యోచిస్తోంది.

ఎలాంటి కొత్త సమస్యలు తలెత్తకుండా, ఉన్న వాటికి శాశ్వత పరిష్కారాన్ని కనుకోవడంలో భాగంగానే కొత్తగా ఈ కమిటీ ని ప్రభుత్వం వేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో 33 మాడ్యూళ్లను అమల్లోకి తీసుకొచ్చినా భూముల సమస్యలు పరిష్కా రం కాలేదు. అందుకే భూమాత వెబ్ పోర్టల్ రూపకల్పనకు ముందే నాటి తప్పిదా లు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందుకెళుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా అనేక భూ సమస్యలకు ధరణి పోర్టల్, కొత్త ఆర్వోఆర్ యాక్ట్ ద్వారా కూ డా పరిష్కారం కనిపించడం లేదు. అలాగే 33 మాడ్యూళ్ల ద్వారా రైతుల దరఖాస్తులు తగ్గడం లేదు. క్షేత్ర స్థాయిలోనూ అనేక వివాదాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ (లీఫ్స్) వంటి సంస్థతో పైలెట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్టుగా తెలిసింది. ‘భూమాత’ వెబ్ పోర్టల్ తయారీ కంటే ముందే గ్రౌండ్ రిపోర్ట్ అధ్యయనం మంచిదని భావించిన ప్రభుత్వం ముందుగా భూ సమస్యల పరిష్కారానికి ఓ కమిటీని వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News