Tuesday, April 30, 2024

కాంగ్రెస్‌కు హిందువుల మనోభావాలు కించపరిచే అలవాటు పెరిగింది

- Advertisement -
- Advertisement -

ఈ నెల 22న నిజాం కళాశాలో బిగ్ స్క్రీన్ ఏర్పాటు: ఎంపి లక్ష్మణ్

మన తెలంగాణ/హైదరాబాద్: హిందూ మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. ఈనెల 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నిజాం కాలేజీ లో ఏర్పాట్లకు భూమి పూజ చేసి బిగ్ స్క్రీన్ ద్వారా లైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షoగా చూసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

అయోధ్యలో భవ్యమైన రామ మందిర ప్రారంభోత్సవం 22 న జరుగుతుందని, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే దినమన్నారు. ప్రపంచమంతా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందన్నారు. బాబర్ దురాక్రమణలో అయోధ్య ద్వంసం అయ్యిందని, 1885 నుంచి రామ మందిరంపై కోర్టులో కేసు నడుస్తూ వచ్చిందన్నారు. అయోధ్యలో అనేక తవ్వకాలు జరిగిన తరువాత చివరికి అక్కడ రాముడి మందిరం ఉందని తేల్చి చెప్పాయన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 1951లో సోమనాథుని మందిర ప్రారంభోత్సవాన్ని సైతం అనాడు నెహ్రూ వ్యతిరేకించారని తెలిపారు. హిందూ మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదన్నారు. లౌకికవాదం అంటే హిందు మనోభావాలను అవమానించడమేనా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై, బండారు దత్తాత్రేయ రావడానికి సుముఖత చూపారన్నారు. దేశ ప్రజల కల నెరవేరబోతోందని, ప్రతిపక్షలు రాజకీయం చేయకుండా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టకు మద్దతు తెలుపాలని కోరారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News