Saturday, April 20, 2024

నిత్యం అవమానాలే!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభనుంచి రాహుల్ గాం ధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘ సంకల్ప్ సత్యాగ్రహ’ను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద నేతలంతా కలిసి దీక్షకు దిగా రు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖ ర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాసహా సీనియర్ నేతలు పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, జైరాం ర మేశ్, పవన్‌కుమార్ బన్సల్, ముకుల్ వా స్నిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పా ల్గొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ శాఖకు చెం దిన పలువురు నేతలు కూడా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అయితే పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను మాత్రం పోలీసులు అనుమతించలేదు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల దృష్టా రాజ్‌ఘాట్‌వద్ద నిరాహారదీక్షకు అనుమతి ఇవ్వలేమని తెలియజేస్తూ ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీకి లేఖ రాశారు.

అలాగే ఈప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. పోలీసుల అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ స్పందించారు.‘ పార్లమెంట్ లో  మా గొంతు నొక్కిన ప్రభుత్వం ఇప్పుడు మహాతాగాంధీ సమాధి వద్ద శాంతియుతంగా నిరాహారదీక్ష చేపట్టడానికి కూడా అనుమతించడం లేదు. ప్రతిపక్షాల నిరసనలను అణచివేయడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. వారు మమ్మల్ని ఆపలేరు. సత్యం కోసం నిరంకుశ పాలనపై పోరాడుతూనే ఉంటాం’ అని అన్నారు. దీక్ష కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్‌ఘాట్‌కు వెలుపల ఒక స్టేజిని కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ గాంధీ కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు అవమానాలకు గురి చేసిందని పేర్కొన్నారు. నెహ్రూ గాంధీ కుటుంబం నేపథ్యాన్ని భరించలేని బిజెపి‘ అమరుడి కుమారుడు’ అంటూ రాహుల్‌గాంధీని నిత్యం అవమానిస్తూనే ఉందని మండిపడ్డారు.

అయితే జాతీయ సమైక్యత కోసం వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆ అమర ప్రధానమంత్రి కుమారుడు మాత్రం దేశాన్ని ఎన్నడూ అవమానించలేదని స్పష్టం చేశారు.‘ అమరుడి కుమారుడు, ద్రోహి, మీర్‌జాఫర్ అంటూ నా సోదరుడ్ని ఎన్నో పేర్లతో పిలుస్తున్నారు. బిజెపి మంత్రులు కూడా మా తల్లిని పార్లమెంటులో అవమానించారు. కొందరు నేతలు మా తల్లిని కించపరుస్తూ మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. నెహ్రూ కుటుంబం పేరును వీళ్లెందుకు ఉపయోగించరంటూ ప్రశ్నించారు. ఇలా ఎన్నో రకాలుగా అవమానించిన వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినా మేం మౌనంగానే ఉన్నాం. రాహుల్‌గాంధీ వేసే ప్రశ్నలకు భయపడుతున్న బిజెపి సమాధానం చెప్పలేకే ఆయనను వేధిస్తోంది. దేశం కోసం నా కుటుంబం పోరాడింది. ఈ భూమిలో నా కుటుంబ సభ్యుల రక్తం ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యం నా కుటుంబం రక్తంతో ముడిపడి ఉంది’ అంటూ బిజెపి తీరుపై ప్రియాంకాగాంధీ నిప్పులు చెరిగారు.

ఇటువంటి అహంకారపూరిత ప్రభుత్వంపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశ ప్రజాస్వామ్యం కోసం తాము ఏమయినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. తమను భయపట్టగలమని వారు భావిస్తే పొరపాటని, తాము ఎప్పటికీ భయపడబోమని ప్రియాంక స్పష్టం చేశారు. కాగా రాహుల్ గాంధీపై మోపిన తప్పుడు కేసును దేశమంతా గమనిస్తోందని మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవాలి. కర్నాటకలో చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌లో కేసు నమోదు చేసి విచారణల పేరుతో వేధించారు. రాహుల్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఆయన గొంతుకను మూగబోయేలా చేయాలన్నదే ఆ పార్టీ కుట్ర. ఆయన ఎవరికీ భయపడరు.

శిరస్సు ఖండించినా తలవంచని అలవాటు రాహుల్‌ది. పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను విమర్శిస్తే అధికార పార్టీకి ఎందుకు బాధ. వాళ్లు ఇప్పుడు ఒబిసిలగురించి మాట్లాడుతున్నారు. లలిత్ మోడీ ..నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వీళ్లెవరూ కూడా ఒబిసిలు కారు. పారిపోయిన నేరగాళ్లను విమర్శిస్తే వీళ్లు బాధపడుతున్నారు. దేశాన్ని కాపాడడానికి కృషి చేసే వ్యక్తిని మీరు(బిజెపి) శిక్షిస్తోంది కానీ దేశాన్ని దోచుకున్న వాళ్లను విదేశాలకు పంపిస్తారు’అని అన్నారు.
గుజరాత్‌లో కాంగ్రెస్ నేతల అరెస్టు
హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, జమ్మూ, కశ్మీర్, పంజాబ్, హర్యానా, గుజరాత్‌లాంటి పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గుజరాత్‌లో నిరసన చేయడం కోసం సిసిసి అధ్యక్షుడు జగదీశ్ తహోర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అమిత్ చావ్డా, పార్టీ సీనియర్ నేత భరత్‌సిన్హ్ సోలంకి తదితరులు పార్టీ కార్యకర్తలతో కలిసిదీక్ష కోసం అహ్మదాబాద్‌లోని లాల్‌దర్వాజా వద్దకు చేరుకున్నప్పుడు పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు. నిరసనకారులను పోలీసు స్టేడియంకు తీసుకెళ్లగా అక్కడ కూడా వాళ్లు నరేంద్ర మోడీకి, బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. శ్రీనగర్‌లో రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు గులాం అహ్మద్ మిర్ నేతృత్వంలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎంఎ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News