Wednesday, April 24, 2024

ఎల్‌విఎం3 రాకెట్ ప్రయోగం సక్సెస్

- Advertisement -
- Advertisement -

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట లోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఎల్‌విఎం3 ఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఆదివారం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను ప్రయోగించడం విశేషం. సరిగ్గా అనుకున్న సమయానికి షార్ లోని రెండో ల్యాంచ్ పాడ్ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు నింగిలోకి ఎల్‌విఎం3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశం లోకి దూసుకెళ్లింది. 20 నిమిషాల పాటు ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంది. యునైటెట్ కింగ్‌డమ్‌కు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీ , భారత్ కు చెందిన భారతీ ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా వన్‌వెబ్ ఇండియాను రూపొందించారు.

ఈ వన్‌వెబ్ ఇండియా పేరుతో 5805 కిలోల బరువు కలిగిన 36 సమాచార ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశ పెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఆనందం వెలిబుచ్చారు. 643 టన్నుల బరువు , 43.5 మీటర్ల పొడవున్న ఈ లాంచ్ వెహికల్ చంద్రయాన్ 2 మిషన్‌తోసహా ఇప్పటివరకు ఐదు విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసిన ఇస్రో భారీ ప్రయోగ వాహనం. బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్ కంపెనీ 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోగా, ఇందులో 36 ఉపగ్రహాలను గత ఏడాది అక్టోబర్ 23న ప్రయోగించడమైంది. మిగిలిన 36 ఉపగ్రహాలు ఇప్పుడు ప్రయోగించారు.

ఈ ప్రయోగంతో భూ కక్షలో వెబ్ వన్ కంపెనీకి చెందిన మొత్తం ఉపగ్రహాల సంఖ్య 616 అవుతుంది. అదే సమయంలో ఇస్రోకు ఈ ఏడాదిలో ఇది రెండో ప్రయోగం. వన్‌వెబ్ అన్నది గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్. అంతరిక్షం నుంచే ఇది పనిచేస్తుంది. ప్రభుత్వాల తోను, వాణిజ్య సంస్థల తోను అనుసంధానం కలిగి ఉంటుంది. దీని ప్రధాన పెట్టుబడి దారు భారతి ఎంటర్‌ప్రైజెస్. ఈ ప్రయోగం సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. షార్ వద్దకు యూకె, అమెరికా, ఫ్రాన్స్ దేశాల శాస్త్రవేత్తలు చేరుకున్నారు. రెండు రోజుల ముందే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ షార్‌కు చేరుకుని అంతా పర్యవేక్షించారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకులు భారీ గా వాహనాల్లో తరలి వచ్చా రు. “ ఈ ప్రయోగం విజయవంతమైంది.

నిర్దేశిత కక్ష లోకి ఉపగ్రహాలను జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 రాకెట్ ప్రవేశ పెట్టింది. ఇస్రో సిబ్బంది సమష్టి కృషి వల్ల ఇది సాధ్యమైంది. వచ్చే నెలలో వీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశ పెడతాం. మార్క్ 3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తాం. జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 రాకెట్‌ను మరింత అభివృద్ది ” అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News