Tuesday, April 30, 2024

ఈసారి కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు రావడం ఖాయం: చిదంబరం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: 2019తో పోల్చితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం జోస్యం చెప్పారు. తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంటుందని పేర్కొన్నారు. పిటిఐవార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడారు. దేశంలో హిందూమతానికి లేదా హిందువులకు ఎలాంటి ముప్పు లేదని, ప్రధాని మోడీ హిందుత్వను రక్షిస్తున్నట్టుగా చూపడానికి, ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని చిదంబరం వ్యాఖ్యానించారు. ఇది బీజేపీ అనుసరిస్తున్న ఓ వ్యూహం.

ఈ ఎన్నికల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని ఢీకొట్టబోతున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దీదీ మరోసారి పట్టు నిలుపుకుని ఇండియా కూటమిని బలోపేతం చేస్తారన్నారు. కేరళలో రెండు ఫ్రంట్‌లు (యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్) 20 సీట్లను గెల్చుకుంటాయి. అక్కడ బీజేపీకి ఒక్క సీటుకూడా రాదు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాదరణ పొందాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు చాలా ఎక్కువ సీట్లు వస్తాయి. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుంది. ఈసారి గెలుచుకోబోయే స్థానాలపై మాకు ఒక అంచనా ఉంది. హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్ ,ఢిల్లీలలో ఇండియా కూటమి గణనీయమైన సీట్లో విజయం సాధిస్తుంది అని చిదంబరం వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News