Monday, May 13, 2024

ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గం అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: ప్రణాళికాబద్ధ్దంగా మల్కాజిగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నానని స్ధానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం ఆయన, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్ వై.ప్రేమ్‌కుమార్‌తో కలిసి ఇక్రిశాట్‌కాలనీలో రూ. 15లక్షల అం చనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న యుజీడి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమన్నారు.

అన్ని కాలనీలలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, నీ టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. తన హయంలో అన్ని డివిజన్‌లలో చేపట్టిన బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులతో ఈ ఏడాది వరద ముంపు సమస్య అంతగా లేదన్నారు. కొన్ని కాలనీలో నేటికి బాక్స్ డ్రైనేజీ పనులు పూర్తి కాగా, మరి కొన్ని కాలనీలలో అంతిమ దశకు చేరాయని తె లిపారు. ఈ పనులు పూర్తయితే డ్రైనేజీ, వరద నీటి సమస్య శాశ్వతంగా చెక్ పడినట్లే అని తెలిపారు.

నిరంతరం తాను అన్ని డివిన్‌లలో పలు కాలనీలు, బస్తీలలో పర్యటనలు చేస్తూ స్ధానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులు తీసుకొని వచ్చి ఆయా పనులను చేపడుతున్నట్లు చెప్పారు. కాలనీ వాసులు తనకు చెప్పిన సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

* వినాయక్‌నగర్‌లో… అనంతరం ఎమ్మెల్యే, వినాయక్‌నగర్ డివిజన్ ప రిధిలోని దీన్ దయాళ్‌నగర్ క మ్యూనిటీ హాల్‌లో దీన్‌దయాళ్ ఉమెన్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ ట్రైనింగ్ సెం టర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో ఈఈ లక్ష్మణ్, జలమండలి జీఎం సునిల్‌కుమార్, మేనేజర్ వేణు, గోపాల్ నాయుడు, ఏఈ శ్రీ కాంత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్, మాజీ కార్పొరేటర్ ఎన్. జగధీష్‌గౌడ్,

సీనియర్ నేత బద్దం పరుశురాంరెడ్డి, మల్కాజిగిరి సర్కిల్ కమిటి అధ్యక్షుడు పి ట్ల శ్రీనివాస్, నియోజకవర్గం అధికార ప్రతినిది జీఎన్‌వీ సతీష్‌కుమార్, ఉపాధ్యక్షుడు పిట్ల నాగరాజు, మీడియా ఇన్‌ఛార్జి గుండా నిరంజన్, ఆనంద్ బాగ్, వినాయక్‌నగర్ డివిజన్‌ల అధ్యక్షుడు నోరి, సత్యమూర్తి, తులసీ సురేష్, నాయకులు, ఇక్రిశాట్ కాలనీ వాసులు , దీన్ దయాళ్‌నగర్ వాసు లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News