Saturday, April 20, 2024

ఇంటికో పోలీస్ కాపలా..

- Advertisement -
- Advertisement -

అక్కన్నపేట : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట నిర్మాణం పనులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అధికారులు ప్రారంభించారు. గుడాటిపల్లి భూ నిర్వాసితులు పనులు అడ్డుకోకుండా ఉండేందుకు పోలీసులు ఆర్ధరాత్రి నుండే బారీ బందోబస్తుతో కట్ట మూసివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్ధితిని సిద్దిపేట పోలీస్‌కమిషనర్ శ్వేత ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. పలువురి భూ నిర్వాసితులకు ఇండ్లు, ఇండ్ల స్థ్ధలాలు సుమారు 100 మందికి పైగా పెళ్లయిన వివాహితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి కింద పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా వివాహితులు నిరసన చేస్తున్నారు.

ఇందులోనే భాగంగా శనివారం జరుగుతున్న ప్రాజెక్టు పనులను భూ నిర్వాసితులు అడ్డగించే ప్రయత్నం చేయగా పోలీసు బలగాలు నిర్వాసితులను గృహ నిర్బందం చేసినట్లు నిర్వాసితులు తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద, పంట పోలాల వద్ద కట్టేసిన నోరులేని మూగజీవులు ,పశువులకు నీరు పెడతామని వెలుతుంటే కనీసం వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని భూ నిర్వాసితులు రోడ్డుపై బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదంలో పలువురు మహిళలకు తోపులాటలో పోలీసులు గాయపరచారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించిన నిర్వాసితులను ఆరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News