Friday, March 29, 2024

తెలంగాణలో విద్యుత్ నిరంతర వెలుగులు

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: సిఎం కెసిఆర్ దూరదృష్టి, కృషి, పట్టుదలతోనే తెలంగాణలో నిరంతర విద్యుత్ వెలుగులు విరిజిమ్ముతున్నాయని విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నియోజకవర్గస్థాయిలో హుస్నాబాద్ పోతారం (ఎస్) శుభం గార్డెన్‌లో విద్యుత్ విజయోత్సవ కార్యక్రమంలో హనుమకొండ జడ్పీ వైస్‌చైర్మన్ సుధీర్ కుమార్‌తో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాన్ని నిర్వహిస్తూ అన్ని సబ్‌స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాలను అందంగా అలంకరించి, సబ్‌స్టేషన్ల వద్ద ప్రజలు, రైతులతో కలిసి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమలు, వ్యవసాయ అవసరాల నిమిత్తం దేశంలోనే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అని అన్నారు. సమైక్య పాలన చీకట్లను చీల్చుకొని స్వరాష్ట్రంలో నిరంతర కాంతి ప్రసరిస్తుందని రెప్పపాటు లేని అంతరాయంతో 24 గంటలపాటు అన్ని రంగాలకు విద్యుత్ సరఫరా చేయడం తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ విషయం అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంటు ఉంటే వార్త పోతే వార్త పగలే కాదు రాత్రులు చీకటే అన్నారు. నాడు విద్యుత్ సరఫరా లేమితో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, వ్యవసాయం ఆగమైందని ప్రస్తుతం గృహ అవసరాలతో పాటు సాగుకు నిరంతర విద్యుత్ అందిస్తున్నామని పుష్కలంగా పంటలు రైతుల చేతికి అందుతున్నాయని అదేవిధంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పెరిగిందని వివరించారు.

అన్ని రంగాలకు నిత్య కోతల నుంచి నిరంతర 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రందే అన్నారు. రానున్న రోజుల్లో దేశంలోనే విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ మారబోతుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు, పవర్లూమ్, స్పిన్నింగ్ మిల్స్, పౌల్ట్రీ ఫారమ్స్‌కు సబ్సిడీలు అందిస్తున్నామని అలాగే లాండ్రీ షాపులు, దోబి గార్డులకు ఫ్రీగా విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. నియోజకవర్గంలో అవసరం ఉన్న ప్రతి చోట సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని నిరంతరం నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. మిగులు విద్యుత్‌ను స్టోరేజ్ చేసుకొని వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

నిరంతరం నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్న విద్యుత్ అధికారులను సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, ఎంపిపి లకావత్ మానస, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, జడ్పిటిసి భూక్యమంగ, ఎఎంసి చైర్మన్ ఎడబోయిన రజిని, వైస్ చైర్మన్ రామోజు రజిత, హుస్నాబాద్ మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండి అన్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి గోపాల్ రెడ్డి, మాజీ ఎంపిపి ఆకుల వెంకట్, మాజీ ఎఎంసి చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ డివిజన్ విద్యుత్ అధికారి శ్రీనివాసులు, ఏడి దుర్గా శ్రీనివాస్, టౌన్ ఏఈ శశిధర్ రెడ్డి, రూరల్ ఏఈ శ్రీమన్నారాయణ, వెస్ట్ ఏఈ యాకూబ్ పాషా, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, పట్టణ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News