Saturday, July 27, 2024

మదర్ థెరిస్సా ఛారిటీ అకౌంట్ల స్తంభనపై వివాదం

- Advertisement -
- Advertisement -

Controversy over suspension of Mother Theresa charity accounts

అకౌంట్ల రద్దు కోరుతూ ఛారిటీయే ఎస్‌బిఐని అభ్యర్థించింది : కేంద్రం

న్యూఢిల్లీ : మదర్ థెరిస్సా ఛారిటీ బ్యాంకు అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసిందన్న వార్తలు ప్రచారం కావడంతో వివాదానికి దారి తీశాయి. ఈ అకౌంట్లను కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసిందని పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ ఆరోపణలపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం సాయంత్రం స్పందించింది. ప్రభుత్వం ఛారిటీ అకౌంట్లను సీజ్ చేయలేదని, కొల్‌కతా కేంద్రంగా ఉన్న ఆ సంస్థ తన అకౌంట్లను రద్దు చేయాలని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసిందని వివరించింది. వ్యతిరేక ఫలితాలు రావడంతో సంస్థ తాలూకు ఎఫ్‌సిఆర్‌ఎ ( ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టు ) లైసెన్సు రెన్యువల్‌కు డిసెంబర్ 25న తిరస్కరించినట్టు హోం మంత్రిత్వశాఖ తెలియచేసింది. ఛారిటీ తాలూకు ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్ 2021 డిసెంబర్ 31 వరకే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది.

మిషనరీస్ ఆఫ్ చారిటీ అకౌంట్లను హోం మంత్రిత్వశాఖ స్తంభింప చేయలేదని, చారిటీ తనకు తాను అకౌంట్లను స్తంభింప చేయాలని అభ్యర్థించిందని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఛారిటీ అధికార వర్గాలు దీనిపై వ్యాఖ్యానించడానికి ఒప్పుకోలేదు. అంతకుముందు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ ఛారిటీ అకౌంట్లను స్తంభింపచేసినట్టు తెలిసి షాక్‌కు గురయ్యానని, క్రిస్మస్ సందర్భంగా ఇలా చేయడాన్ని ఆమె విమర్శించారు. కేంద్రం నిర్వాకం వల్ల ఛారిటీకి చెందిన 22,000 మంది రోగులు , ఉద్యోగులు, ఆహారం, మందులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆరోపించారు. బెనర్జీ ఆరోపణలపై ఛారిటీ గ్రూపు ప్రతినిధి సునీతా కుమార్ స్పందిస్తూ ఛారిటీ బ్యాంకు లావాదేవీలు యధానిధిగా సాగుతున్నాయని వివరించారు. బ్యాంకు ఖాతాల స్తంభనపై కేంద్రం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అంతా సజావుగా సాగుతోందని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News