Friday, September 19, 2025

అధికారిపై కౌన్సిలర్ భర్త చిందులు

- Advertisement -
- Advertisement -
  • ట్రెడ్‌లైసెన్స్ ఇవ్వాలని ఒత్తిడి

ఇల్లందు : మున్సిపల్ అధికారిపై మున్సిపల్ కౌన్సిలర్ భర్త చిందులు వేసి బెదిరించిన సంఘటన ఇల్లందు మున్సిపాలిటిలో బుధవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బండ్ల రాధాకృష్ణకు ట్రెడ్‌లైసెన్స్ ఇవ్వాలని స్ధానిక 5వ వార్డు కౌన్సిలర్ యలమందుల వీణ భర్త వాసు దరఖాస్తు చేసుకున్నాడు. అదే విషయమై అధికారిని వివరణ అడుగగా ఆయన కొంత సమయం పడుతుందని పై అధికారుల సూచనలు తీసుకోవాల్సివుందన్నారు.

అంతటితో కోపోద్రికుడైన వాసు అధికారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ నాపనిచేయవా, నీ అంతుచూస్తానని బెదిరిస్తూ దాడికి యత్నించబోగా అక్కడేఉన్న అధికారులు, కౌన్సిలర్‌లు అతనిని వారించి బయటకు తీసుకవచ్చారు. ఇకపోతే అధికారినని చూడకుండా తనని బూతులు తిడుతూ కౌన్సిలర్ భర్త అవమానపరిచాడని అధికారి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.

  • అధికారిపై దాడిని ఖండించిన జెఎసి

మున్సిపల్ అధికారిపై కౌన్సిలర్ భర్త చేసిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నామని మాదిగ జేఏసి సభ్యులు అన్నారు. దళిత అధికారనే నేపథ్యంతోనే అతడిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం జరిగిందని తక్షణమే యలమందుల వాసుపై ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదు చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News