Thursday, March 28, 2024

మున్సిపల్ ఎన్నికల బందోబస్తుపై సిపి సజ్జనార్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

CP Sajjanar

 

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లను సిపి సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్‌లో సిపి విసి సజ్జనార్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మున్సిపాలిటీల ఎన్నికల బందోబస్తుకు ఎంతమంది సిబ్బంది అవసరం ఉంటుందని అడిగితెలుసుకున్నారు. దాదాపుగా 1,100మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికల కోసం కేటాయించనున్నారు. గత ఎన్నికల్లో గొడవలు జరిగిన ప్రాంతాలు ఏవి ఉన్నాయి, వాటికి కేటాయించాల్సిన బందోబస్తు గురించి తెలుసుకున్నారు.

సైబరాబాద్ పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, వాటికి ఎంత మంది సిబ్బంది అవసరం ఉంది తదితర వివరాలు అధికారులను అడిగారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో భద్రతా సిబ్బందిని కేటాయించేందుకు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించనున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిల్లో ఎన్నికల సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సిపి సజ్జనార్ ఆదేశించారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించిన మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఏఆర్ సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించనున్నట్లు పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. రిజర్వు సిబ్బందిలోని పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు ఎన్నికల విధుల్లో కేటాయిస్తామని తెలిపారు. సమావేశంలో ఎడిసిపి మాణిక్‌రాజ్, ఇన్స్‌స్పెక్టర్ మట్టయ్య పాల్గొన్నారు.

CP Sajjanar review on Municipal Election security
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News