శాతవాహన యూనివర్సిటీ: ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న, పూర్తి చేసుకోబోతున్న సీఈసీ, ఎంఈసీ, ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు డిగ్రీలో నూతనంగా ప్రవేశపెట్టిన బీబీఏ రిటెయిలింగ్ కోర్సుపై అవగాహనను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌లకు సూచించారు.
బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రధానోపాధ్యాయులు ఇతర బోధన సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఎక్కువ కల్పిస్తూ నూతనంగా ప్రవేశపెట్టిన బీబీఏ రిటెయిలింగ్ కోర్సులపై సీఈసీ, ఎంఈసీ, ఒకేషనల్ ఇంటర్మీడియట్ స్థాయి విద్యారుథలకు అవగాహనను కల్పించాలన్నారు.
ఈ కోర్సు ద్వారా వారంలో మూడు రోజులు నేరుగా పాఠాలను బోధించగా మరో మూడు రోజులు క్షేత్రస్థాయిలో స్కిల్ కన్సల్టెస్సీ విద్యనందిస్తుందని తెలిపారు. దీనికి 6 వేల రూపాయలు మొదటగా స్టెఫండ్ కూడా అందించడం జరుగుతుందని, కోర్సు ముగిసిన తరువాత ప్లేస్‌మెంట్ మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సారార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మీ, ఇతర బోధన సిబ్బంది సతీష్‌కుమార్, చంద్రమౌళి, లావణ్య పాల్గొన్నారు.