Monday, April 29, 2024

పెట్రో ధరలపై ‘క్రూడ్’ ఎఫెక్ట్

- Advertisement -
- Advertisement -

Petro prices

 

దేశీయంగా లీటరు డీజిల్‌పై 15 పైసలు, పెట్రోల్‌పై 10 పైసలు పెంపు

న్యూఢిల్లీ: చమురు కంపెనీలు శుక్రవారం వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. జనవరి 1న పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత గురువారం, శుక్రవారం పెంచారు. ఇరాక్‌లో అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో ముడి క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. లీటర్ పెట్రోలు ధర 10 పైసలు, లీటర్ డీజిల్ ధర 15 పైసలు పెరిగింది. దేశీయంగా పెట్రో ధరలు అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా పెరగడం, తగ్గడం వెంటనే జరుగుతోంది. గ్లోబల్ మార్కెట్లో రేట్లు పెరిగితే వెంటనే దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. గురువారం తర్వాత శుక్రవారం కూడా రేట్లు పెరగడంతో వరుసగా రెండో రోజు కూడా పెట్రోమంటతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా మిలటరీ క్షిపణి దాడిలో ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమనీ మృతి చెందాడు. దీంతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి చమురు ధర పెరిగింది.

భారీగా పెరిగిన ముడి చమురు ధరలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 4 శాతం పెరిగాయి. ఇది చమురు మార్కెటింగ్ సంస్థలపై ఒత్తిడి తె చ్చింది. శుక్రవారం బ్రెంట్ ముడి చమురు ధర 4.4 శాతం పెరిగి 69.16 డాలర్లకు చేరుకుంది. డబ్ల్యుటిఐ 4.3% పెరిగి 63.84 డాలర్లకు చేరుకుంది. ఇది ఇతర దేశాలతో పాటు భారత్‌పై కూడా ప్రభావం చూ పింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చు. దీనికి కారణం అరబ్ దేశాలతో పాటు ఇరాన్ నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.

నాలుగు మెట్రోలలో రేటు పెరిగింది
ఢిల్లీలో ఒక లీటరు పెట్రోల్ ధర 10 పైసలు, అలాగే కోల్‌కతా, ముంబైలలో ఏడు పైసలు పెరిగింది. అదే సమయంలో చెన్నైలో పెట్రోల్ ధర ఎనిమిది పైసలు పెరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు వరుసగా రూ.75.35, రూ.77.94, రూ.80.94, రూ.78.28కు పెరిగాయి. డీజిల్ విషయానికొస్తే ఒక లీటరు డీజిల్ ధర ఢిల్లీలో 14 పైసలు, కోల్‌కతాలో 12 పైసలు, ముంబైలో 13 పైసలు పెరిగింది. అదే సమయంలో, చెన్నైలో డీజిల్ ధర 14 పైసలు పెరిగింది. ఆ తర్వాత వీటి ధరలు ఈ నగరాల్లో వరుసగా రూ.68.25, రూ.70.61, రూ.71.56, రూ.72.12 కు పెరిగాయి.

ఉదయం ఆరు గంటలకు ధర మార్పులు
ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధర మారుతుంది. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో, ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర అంశాలు పెట్రో ధరల పెరుగుదలకు కారణమవుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా విదేశీ మారకపు రేటుతో పాటు చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్ రేటు, డీజిల్ రేట్లను నిర్ణయిస్తాయి. రిటైల్ అమ్మకం పెట్రోల్, డీజిల్ కోసం చెల్లించే మొత్తంలో 55.5 శాతం పెట్రోల్, 47.3 శాతం డీజిల్ కోసం పన్ను చెల్లిస్తున్నారు.

Crude oil effect on Petro prices
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News