Thursday, May 9, 2024

సకల సౌకర్యాలు

- Advertisement -
- Advertisement -

 Medaram jatara

 

మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
భక్తులకు ఇబ్బందిలేకుండా చూడాలి : అధికారులకు సిఎస్ ఆదేశాలు

హైదరాబాద్ : వచ్చే నెలలో మేడారంలో జరిగే సమ్మక్క, సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్ ద్వారా నిర్మించే రోడ్ల, కల్వర్టుల నిర్మాణాలతో పాటు ఇతర రోడ్ల ప్యాచ్ వర్క్‌లను జనవరి 25వ తేదీలోపు పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. రోడ్ల వెంట మూడు భాషలతో కూడిన సైన్ బోర్డుల ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్‌ల వద్ద వలంటీర్లను ఏర్పాటు చేసి సక్రమంగా వాహనాలు పార్కింగ్ చేసేలా చూడాలని, శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిఎస్ సూచించారు.

జిల్లా యంత్రాంగం అక్కడే ఉండి పనులను సమన్వయంతో పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను సక్రమ పద్ధతిలో ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటిక ప్పుడు సమాచారం అందించాలన్నారు. టాయిలెట్లు, ట్యాప్‌ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్, ఎస్పీ, స్పెషల్ ఆఫీసర్, ఐటిడిఎ పిఓ సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. గద్దెలకు వెళ్లే దారుల్లో షాపుల వద్ద రద్దీ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యారీకేడ్లను ఏర్పాటు చేసి రద్దీ లేకుండా క్రమబద్ధీకరించాలన్నారు. త్వరలోనే పను లను పరిశీలిస్తానని ఆయన తెలిపారు.

డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక్క చోట పిఎ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్‌దత్ ఎక్కా , డిజిపి మహేందర్ రెడ్డి, అదనపు డిజిపి జితేందర్, ఐజి నాగిరెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు, ఎస్‌పి పాటిల్, ఐటిడిఎ పిఓ చక్రధర్ రావు, ఆర్‌డబ్లూఎస్, ఆర్‌అండ్‌బి పంచాయతీ రాజ్, ఈఎన్‌సి శాఖల అధికారులు పాల్గొన్నారు.

CS review on Medaram jatara arrangements
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News