Saturday, April 20, 2024

అవయవ మార్పిడి రోగులకు బాసట!

- Advertisement -
- Advertisement -

organ Transplant Patients

 

ట్రాన్స్‌ప్లాంటేషన్‌కే కాదు.. రోగ నిరోధక మందులకు సాయం
ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి సంరక్షణ ప్యాకేజీ అమలు
ఉచితంగా రోగ నిరోధక మందులు సరఫరా
జీవితకాలం ఆర్ధిక చేయూత ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం

హైదరాబాద్ : అవయవ మార్పిడి చేయించుకునే రోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలువనుంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి సంరక్షణ ప్యాకేజీని అమలు చేయాలని నిర్ణయించింది. తద్వారా ఖరీదైన అవయమ మార్పిడి చేయించుకునే రోగులకు పెద్దఎత్తున ప్రయోజనం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికలను సంబంధిత అధికారులు సిద్దం చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద అనేక రోగులకు ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. అయితే అవయవ మార్పిడి వంటి చికిత్సలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు కాకపోవడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు.

పైగా శస్త్రచికిత్సలకు పెద్దఎత్తున వైద్యఖర్చులను భరించాల్సి వస్తోంది. ఇది రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు తీవ్ర భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇకపై అన్ని రకాల శస్త్ర చికిత్సలతో పాటు రోగులకు జీవిత కాలం ఉచితంగా మందులను కూడా సరఫరా చేసే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లుగా తెలుస్తోంది. తదనుగుణంగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ ఉచిత ఆరోగ్య బీమా పథకం కింద రోగులకు పూర్తి ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఆరోగ్యశ్రీ ఉచిత ఆరోగ్య పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే కొత్త ప్యాకేజీలో భాగంగా గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మూల కణాలు వంటి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్న రోగులకు ఖర్చుతో పాటు పూర్తి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది.

జీవితమంతా ఉచిత రోగ నిరోధక మందులు..
అవయమార్పిడి శస్త్ర చికిత్సకు శరీరం సహకరించని రోగులకు జీవితమంతా ఉచిత రోగనిరోధక మందులను అందించనుందని తెలుస్తోంది. ఫలితంగా సదరు రోగికి జీవితకాలం ఆర్థిక సహాయం అందించనుంది. ఆరోగ్యశ్రీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ప్యాకేజీలో భాగంగా కాడవర్ కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు ప్రభుత్వం రూ.10.50 లక్షలు, మరో రూ. 2.64 లక్షలు మొదటి సంవత్సరం ఇమ్యునోథెరపీకి ప్రభుత్వం సహాయం అందిస్తుంది. కాగా రెండో సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం రూ. 38వేల చొప్పున రోగికి అందించబడుతుంది.

అదే విధంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం ప్రభుత్వం రూ. 10.88 లక్షలు, మరో రూ. 2.62 లక్షలు ఇమ్యునోథెరపీ ఖర్చులను సమకూర్చడానికి రెండవ సంవత్సరం నుండి రోగి మొత్తం జీవిత కాలంలో రూ. 38వేలు చెల్లిస్తారు. కాడవర్ గుండె మార్పిడి కోసం ప్యాకేజీలో రూ. 11.40 లక్షలు, మరో రూ. 2.20 లక్షలు ఇంజక్షన్ థెరపీ కోసం ప్రభుత్వం ప్రతి 3 నెలలకు పోస్ట్ మార్పిడి కోసం రూ. 1.50 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తుంది. అలాగే మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న రోగులకు, అవయవ మార్పిడి విషయంలో ప్రభుత్వం రూ. 1.61 లక్షలు, మరో 6 నెలలు తరువాత రోగ నిరోధక మందుల చికిత్సకు రూ. 91వేల చొప్పున చెల్లించనుంది.

ముందుకురాని ప్రైవేట్ ఆసుపత్రులు..
నిజాం ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)తో పాటుకొన్ని పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు మినహా, ప్రైవేట్ ఆస్పత్రులు ఈ ప్యాకేజీని అంగీకరించడం లేదు. ఈ ప్యాకేజీలు చాలా తక్కువగా ఉన్నాయని వారు భావిస్తున్నందున వారు ఆరోగ్యశ్రీ కింద నుండి బయటకు వెళ్ళిపోయారు. ఫలితంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో అవయవ మార్పిడి చికిత్సను పొందడానికి అవకాశం లేకపోవడంతో నిమ్స్ ఆసుపత్రిలో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం నిమ్స్‌లో వివిధ రకాల అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కోసం వెయిటింగ్ లిస్టులో 500 మందికి పైగా రోగులు ఉన్నారు.

Help for organ Transplant Patients
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News