Tuesday, March 19, 2024

చితిపై లేచికూర్చున్న శవం..పరుగులు తీసిన బంధుజనం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: చితి మీద పడుకున్న శవం హఠాత్తుగా లేచి కూర్చుంది. చనిపోయాడనుకున్న మనిషికి దహన సంస్కారాలు నిర్వహించడానికి బంధువులంతా స్మశానవాటికకు చేరుకోగా చితికి నప్పంటించడానికి సర్వం సిద్ధమైన సమయంలో చితి మీద పడుకున్న శవంలో అకస్మాత్తుగా కదలిక మొదలవడంతో బంధువులు బెంబేలు పడ్డారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మధ్యప్రదేశ్‌లోని మొరేనాలో గత మంగళవారం ఈ వింత సంఘటన సంభవించింది.

 

కిడ్నీ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న జీతూ ప్రజాపతి అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు పరీక్షించి చూడగా నాడి కొట్టుకోవడం నిలిచిపోయింది. గుండె చప్పుడు ఆగిపోయింది. దీంతో అతడు మరణించాడని నిర్ధారించుకున్న బంధువులు అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు.

శవ యాత్ర స్మశానవాటికకు చేరుకుంది. పాడె మీద ఉన్న ప్రజాపతి మృతదేహాన్ని చితిపైకి చేర్చారు. ఇక చితికి నిప్పంటించడానికి సమాయత్తమవుతున్న సమయంలో శవంలో కదలిక కనిపించింది. కళ్లు నులుముకుని చూసిన బంధువులకు శవం లేవడానికి ప్రయత్నించడంతో వారంతా భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఎందుకైనా మంచిదని మళ్లీ అచితి వద్దకు చేరుకున్న బంధువులకు చితి మీద కూర్చోవడానికి ప్రయత్నిస్తున్న ప్రజాపతి కనిపించాడు. వెంటనే డాక్టర్‌కు కబులరుచేసి రప్పించగా ప్రజాపతిని పరీక్షించిన వైద్యుడు అతడు బతికే ఉన్నాడని నిర్ధారించాడు. వెంటనే తదుపరి చికిత్స నిమిత్తం ప్రజాపతిని ఆసుపత్రిలో చేర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News